గుప్పెడంత మనసు సీరియల్ నటుడు రిషి జీవితంలో ఇంత విషాదం ఉందా?

నటీనటులు సినిమా, సీరియల్స్ లో నటిస్తూ తమ నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంటూ వారిని నవ్విస్తూ ఉంటారు. తెరమీద అందరిని నవ్వించే ఎంతోమంది నటీనటుల జీవితంలో ఎంతో విషాదం నిండి ఉంటుంది కానీ వారు ఆ విషాదాన్ని మరిచిపోయి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రిషి తన నటనతో బుల్లితెర ప్రేక్షకులు అనే ఆకట్టుకుని ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్నాడు. మొదటి వరుసలో ఉన్న కార్తీకదీపం సీరియల్ ని వెనక్కి నటి గుప్పెడంత మనసు సీరియల్ మొదటి స్థానంలో ఉండటానికి కారణం రిషి వసుధార మధ్య ఉన్న సన్నివేశాలు అని చెప్పవచ్చు.

ఇలా గుప్పెడంత మనసు సీరియల్లో యాంగ్రీ యంగ్ మాన్ ల కనిపిస్తున్న రిషి అమ్మాయిలకు అభిమాన హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలో ఇటీవల స్టార్ మా అవార్డ్స్ లో అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఇక ఈ అవార్డు కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేశారు. ఈ అవార్డ్స్ ఈవెంట్ లో రిషి తన తల్లితండ్రిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కొడుకు కష్టసుఖాలలో తోడుగా నిలిచి అండగా నిలవాల్సిన రిషి తండ్రి పక్షవాతంతో మంచాన పడితే రిషి తన తండ్రికి తండ్రిలా మారి కన్న కొడుకుకి సేవలు చేసినట్టు సేవలు చేశాడు.

ఇటీవల విడుదల చేసిన ఈ ప్రోమోలో రిషి తన తండ్రికి అన్నం తినిపిస్తూ చంటి పిల్లాడిలా తన తండ్రికి సేవలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఇక ఈ అవార్డు కార్యక్రమంలో అవార్డు అందుకున్న రిషి మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో రిషి మాట్లాడుతూ.. ” మా నాన్నను నేను నాకే పుట్టిన కొడుకుల చూసుకుంటున్నాను. అందరి జీవితంలో ఇలా జరుగుతుందో లేదో… కానీ నా జీవితంలో మాత్రం జరిగింది. నన్ను కన్న తండ్రికి నేనే నాన్నను కావటం నాకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తాను” అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. దీంతో అక్కడున్న వారందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు.