రిషి సార్ ను నా నుంచి దూరం చేయడం ఎవరి వల్ల కాదు… రాజీవ్ కి వార్నింగ్ ఇచ్చిన వసుధార!

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే గత ఎపిసోడ్లో వసుధార కోసం గౌతమ్ రూమ్ కీస్ ఇవ్వమని రిషి జగతికి చెబుతారు.తను మన మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ కావడంతో తన మర్యాదలన్నీ కూడా మనమే చూసుకోవాలి తనకు ఇవ్వండి మేడం అంటూ రిషి జగతికి కీస్ ఇస్తాడు. ఇక రిషి ఇవ్వమన్నారని చెప్పి జగతి కూడా వసుధారకు గౌతమ్ రూమ్ కీస్ ఇస్తుంది.

ఇలా రిషి సార్ తనకోసం ఫ్లాట్ చూసి పెట్టారని తెలియగానే వసుధార సంతోషపడుతుంది అయితే నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా వసుధార రిషి వద్దకు వెళ్ళగా రిషి ఏదో పని చేస్తూ ఉంటాడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో… నేను మీకు థాంక్స్ చెబుదామని వచ్చాను సర్ అంటూ వసుధారా మాట్లాడుతుంది.జగతి రిషి నీకు కీస్ ఇవ్వమన్నారు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని తనకు థాంక్స్ చెప్పాలని వచ్చానని వసుధార మాట్లాడుతుంది.

అనంతరం వసు మనం మాట్లాడుకోవాలి సర్ అని అనడంతో నువ్వు మనం అనే పదం వాడకు నాకు ఆ పదం వింటే చిరాగ్గా ఉందని రిషి కోపం తెచ్చుకుంటాడు. ఇక వసుధారా కాలేజ్ నుంచి వెళుతుండగా తన బావ రాజీవ్ ఎదురుపడి మన బంధం ఇంకా తెగిపోలేదు నువ్వు రిషి సార్ కిపెళ్లయిందని చెప్పేసావు అనడంతో వసుధార జైలులో ఉండే మనస్ఫూర్తిగా నేను ఈ పెళ్లి చేసుకున్నాను అనే విషయాలను గుర్తు చేసుకుంటుంది. నువ్వు ఎన్ని వేషాలు వేసిన నన్ను రిషి సార్ ను ఎవరు విడదీయలేరు అంటూ వసుధార రాజీవ్ కివార్నింగ్ ఇస్తుంది ఇంతటితో ఈ ప్రోమో పూర్తి అవుతుంది. అయితే ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.