బిగ్‌బాస్‌లో గ్రూపు రాజకీయం: గుస్సా అయిన యానీ మాస్టర్

కెప్టెన్సీ పోటీ కోసం జరిగిన టాస్క్‌లో యానీ మాస్టర్ తన శక్తికి మించి కష్టపడ్డారు. కానీ, అక్కడ గ్రూపు పాలిటిక్స్ నడిచాయ్. సన్నీ, మానస్ కోసం.. సిరి, షన్నూ ఒకరి కోసం ఒకరు ఆడుకున్నారు. అలా యానీ మాస్టర్ ఆ పోటీలో నిలవలేకపోయారు. మధ్యలోనే గేమ్ నుండి తప్పుకున్నారు.

మిగిలిన కంటెస్టెంట్లు యానీ మాస్టర్‌ని ఎంతలా ప్రోత్సహించినా ఆమె అంగీకరించలేదు. గ్రూపులు కట్టి ఆడుతున్నారు. అలా అయితే, ఇండివిడ్యువల్ గేమ్‌ ఎప్పటికీ గెలవదు.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యాంకర్ రవి, ప్రియాంక, విశ్వ తదితరులు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, యానీ మాస్టర్ వినలేదు.

పెద్దగా అరుస్తూ, తన ఆవేదన బయట పెట్టారు. వాస్తవానికి యానీ మాస్టర్ మొదట్నుంచీ ఇండిపెండెంట్ గేమ్ ఆడుతున్నారు. టాస్క్‌ల్లోనూ తనదైన బెస్ట్ ఇస్తున్నారు. అందుకే ఆమె ఆవేదనలో అర్ధం ఉంది. అలా అయితే, ఎప్పటికీ తాను కెప్టెన్ అవ్వలేనన్నది ఆమె ఆవేదన. బిగ్‌బాస్‌లో గెలవాలంటే, గ్రూపులు కట్టడం తప్పదా.? గ్రూపుల్లేని ఆటకు గెలుపు పట్టం కట్టదా.? చూడాలి మరి, ఏం జరుగుతుందో.