జెస్సీకి సీమంతం చేయాలన్న జ్ఞానాంభ…. బిడ్డ పై ఆశలు వదులుకోమన్న డాక్టర్!

కుటుంబ కథా నేపథ్యంలో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న జానకి కలగనలేదు సీరియల్ రోజు రోజుకి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే… మల్లిక కడుపు పోవడంతో తన ఇంట్లో తిరగాల్సిన మహాలక్ష్మి లేకుండా పోయిందని జ్ఞానంభ బాదపడుతూ ఉంటుంది తనకు జానకి ఎంతో ధైర్యం చెబుతుంది మరుసటి రోజు గోవిందరాజులు జ్ఞానంబ ఇద్దరు గుడికి వెళ్ళగా వారి బాధను చూసిన పూజారి ఇంట్లో అందరి బాధలు తొలగిపోవాలంటే జెస్సికి సీమంతం చేయమని చెబుతారు.

మరోవైపు రామా జానకి జెస్సిని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తారు.డాక్టర్ చెకప్ చేసిన తర్వాత జెస్సిని బయటకు వెళ్ళమని చెప్పి రామా జానకితో మాట్లాడుతుంది. కడుపులో పెరుగుతున్న బిడ్డ చాలా వీక్ గా ఉందని అసలు నాలుగవ నెల గ్రోత్ ఏమాత్రం లేదని డాక్టర్ షాకింగ్ న్యూస్ చెబుతుంది.అదేంటి డాక్టర్ గారు బిడ్డ పుట్టిన తర్వాత ప్రాబ్లం క్లియర్ చేయొచ్చు అన్నారు కదా అని జానకి అడగడంతో అసలు బిడ్డ పుట్టే ఛాన్స్ లేదు తనకి ఎప్పుడైనా అబార్షన్ కావచ్చు మీరు బిడ్డపై ఏమాత్రం ఆశలు పెట్టుకోకండి ముందుగానే మెంటల్ గా ప్రిపేర్ కండి అంటూ చెబుతారు.

మరోవైపు జెస్సి తన కడుపు చూసుకుంటూ పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ ఉంటుంది అంతలోనే అక్కడికి రామా జానకి రావడంతో అక్క బిడ్డ ఎలా ఉంది బాగుంది కదా.. అంతా ఓకే కదా అని అడగడంతో జానకి బేబీ గ్రోత్ చాలా బాగుంది అంటూ ఇంటికి వెళ్తారు. ఇంట్లో జ్ఞానాంభ జెస్సి అని పిలుస్తూ ఉండగా.. అంతలో చికిత వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళారమ్మ గారు అంటూ సమాధానం చెబుతుంది. అంతలోనే రామ వాళ్ళు రావడంతో వెంటనే జ్ఞానంభ జెస్సికి బొట్టు పెట్టి ఓకే ఇంట్లో ఇద్దరు కడుపుతో ఉండకూడదు అంటారు అందుకే మల్లికకు అబార్షన్ అయిందేమో అయితే మన బాధలను తొలగిపోవాలంటే జెస్సికి సీమంతం చేద్దామని చెబుతుంది. అది విన్నటువంటి మల్లికా తనకు ఆ అవకాశం లేకుండా పోయిందని బాధపడుతుంది. జ్ఞానాంబ చెప్పిన మాట విన్న జానకి ఇప్పుడెందుకు అత్తయ్య ఇవన్నీ అంటూ చెప్పగాసీమంతం చేస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది రేపే సీమంతం ఏర్పాట్లు అన్నీ చూడమని చెబుతుంది.

ఇక జానకి ఈ విషయం ఎట్టి పరిస్థితులలోనూ అత్తయ్యకు జెస్సికి తెలియకూడదు రామ గారు అని చెబుతుంది. మరోవైపు జ్ఞానంభ జెస్సి తల్లిదండ్రులకి ఫోన్ చేసి సీమంతానికి రమ్మని ఆహ్వానిస్తుంది. ఆ మాట విని జెస్సి తండ్రి పీటర్ చాలా సంతోషిస్తాడు.