కూతురిపై ప్రేమను కురిపించిన గ్లామరస్ యాంకర్… వైరల్ అవుతున్న వీడియో…!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఫిమేల్ యాంకర్స్ గా మంచి గుర్తింపు పొందారు. అయితే వారిలో సుమ కనకాల మాత్రమే ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే గతంలో సుమ కన్నా ఎక్కువ పాపులర్ అయ్యి స్టార్ యాంకర్ గా ఉదయభాను మంచి గుర్తింపు పొందింది. ఒకప్పుడు స్టార్ యాంకర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఉదయభాను. ఎన్నో టీవీ షో లకి యాంకర్ గా వ్యవహరించిన ఉదయభాను తన అందంతో పాటు మాటలతో కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అంతేకాకుండా లీడర్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసి వెండితెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఇలా స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సమయంలో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఉదయభాను తన పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం కేటాయించింది. ఆ తర్వాత ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను పూర్తిగా ఇంటికి పరిమితం అయింది.అయితే తన పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవటంతో ఉదయభాను మళ్ళీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చింది.

మునుపటిలా టీవి షోస్ లేకపోయినా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో ఇటీవల సోషల్ మీడియాలో ఉదయభాను షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉదయభాను తన చిన్న కూతురుతో ముచ్చట్లు చెబుతూ ఆమెను ముద్దాడుతూ కూతురుపై తన ప్రేమను కురిపించింది. ప్రస్తుతం ఉదయభాను తన కూతురితో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.