ఎలిమినేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన గీతు.. అతని వల్ల నేను ఎలిమినేట్ కాలేదు?

తొమ్మిది వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 రోజుకి ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ సీజన్ సిక్స్ ప్రారంభమైన రెండు మూడు వారాలు ప్రజలు ఈ షో ని చూడటానికి ఆసక్తి చూపలేదు. కానీ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల పోటీని చూస్తుంటే ప్రేక్షకులకు ఈ షో చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ తొమ్మిదవ వారంలో ఎవరు ఊహించని విధంగా గీతు రాయల్ ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజునుండే ప్రతిక్షణం ఆటలో గెలవడానికి ప్రయత్నం చేసిన గీతూ..టాప్ ఫైవ్ లో నిలవకుండానే తొమ్మిదవ వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.

ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రావటం ఇష్టం లేక బోరున ఏడ్చింది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నంతకాలం తన ప్రవర్తనతో ఆటతీరుతో అందరిని బాధపెట్టిన గీతు.. ఎలిమినేట్ అవ్వగానే నేను ఇక్కడి నుండి వెళ్ళను నన్ను పంపించకండి బిగ్ బాస్ అంటూ వేడుకుంది. ఇక హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బిగ్ బాస్ హౌస్ లో తన ఎక్స్పీరియన్స్ గురించి, ఎలిమినేషన్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ ఇంటర్వ్యూ లో గీతూ మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లో ప్రతి నిమిషం గెలవడం కోసమే ఆడాను అంటూ చెప్పుకొచ్చింది.

కానీ నా ఆట తీరు ప్రేక్షకులకు నచ్చలేదేమో అందుకే ఎలిమినేట్ చేశారంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత నాలోని లోపాలను సరి చేసుకుంటూనే వస్తున్నాను. అయినా ఎలిమినేట్ అవ్వాల్సొచ్చింది. సిగరెట్లు – లైటర్ దాచేసినందుకు బాలాదిత్య అన్న మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. ఆ మాటలకు నేను చాలా హర్ట్ అయ్యాను. నేను ఎవ్వరిని పర్సనల్ గా టార్గెట్ చేయను. ఎదుటివారి ఎమోషన్స్ ను నేను హర్ట్ చేయను. చేపల టాస్క్ లో సంచాలక్ గా నేను వ్యవహరించిన తీరు తప్పంటే నేను ఒప్పుకోనూ. అలాగే బాలాదిత్య విషయం కారణంగానే నేను ఎలిమినేట్ అయ్యాను అంటే కూడా నేను ఒప్పుకోనూ.. బిగ్ బాస్ షో కి వెళ్ళకముందు బయట ఎలా ఉన్నానో హౌజ్ లో కూడా అలాగే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.