ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 రోజుకి చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. మొదటి రెండు వారాలు కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు సీరియస్ గా తీసుకోకుండా టైంపాస్ చేయటంతో తక్కువ రేటింగ్స్ వచ్చాయి. అయితే నాగార్జున అందరికీ క్లాస్ పీకటంతో అందరు దారిలోకి వచ్చి సీరియస్ గా ఆట ఆడటం మొదలుపెట్టారు. దీంతో కొంతకాలంగా బిగ్ బాస్ షో చాలా రసవత్తరంగా మారింది. ముఖ్యంగా కెప్టెన్సీ క కంటెండర్ పోటీలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లేదా కంటెస్టెంట్ లందరూ ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రతివారం నామినేషన్స్ కూడా చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకున్న ఈ ఆరవ సీజన్ ప్రస్తుతం పదవ వారంలో కొనసాగుతోంది. ఇక ఈ వారంలో మొత్తం 12 కంటెస్టెంట్లలో తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. గతవారం గీత రాయల్ ఎలిమినేషన్ అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక ఈ వారంలో కెప్టెన్సీ కంటెండర్ పోటీ కోసం బిగ్ బాస్ స్నేక్స్ అండ్ లాడర్స్ టాస్క్ ఇచ్చారు. వారిలో స్నేక్స్ టీమ్ నుంచి ఆదిరెడ్డి, ఫైమా, రోహిత్, వాసంతి, కీర్తి భట్, వాసంతి కంటెండర్ టాస్క్ కు వెళ్లారు.ఇక ఈ టాస్క్ లో రేవంత్ సంచాలక్ గా వ్యవహరించాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో చివరికి చివరిగా ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీసత్యకు మద్య పోటి జరగగా… ఫైమా కెప్టెన్ గా నిలిచినట్లు సమాచారం.
ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో రేవంత్ చాలా డల్ గా కనిపించాడు. అయితే రేవంత్ బాధ పడటం చూసిన ఆదిరెడ్డి రేవంత్ దగ్గరికి వచ్చి.. బ్రో ఎక్కుగా రియాక్ట్ అవద్దు ప్లీజ్ అంటూ రేవంత్ కన్నీళ్లు తుడిచాడు. దీంతో నేను ఒక ఒక లూజర్ అంటూ రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత మెరీనా కూడా రేవంత్ ని ఓదార్చడానికి ప్రయత్నం చేసింది. ఇక శ్రీ సత్య రేవంత్ వద్దకు వచ్చి దయచేసి ఇలా ఉండదు.. తనతో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పమని అడిగింది. దీంతో నాతో నాకే ప్రాబ్లమ్ అంటూ రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు బిగ్ బాస్ రేవంత్ ను కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.