బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా మారింది అయితే నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే భాస్కర్ రావు జ్ఞానంబ వారి దగ్గరకు వచ్చి తన అప్పు కట్టాలని డిమాండ్ చేస్తాడు. మీ ఇంటి పరిస్థితులు చూస్తుంటే నాకు అప్పు తిరిగి చెల్లించాలని అనిపిస్తుందని నిష్టూరంగా మాట్లాడుతాడు.అదేంటి బాబాయ్ మూడు నెలలు గడువు అడిగాను కదా అని రామా అనడంతో మూడు నెలలు కాదు రామా మూడు రోజుల్లో నాకు డబ్బు ఇచ్చి ఇల్లు విడిపించుకోండి లేదంటే ఇంటిని ఆక్రమిస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.
ఇదే అదునుగా భావించిన మల్లికా అఖిల్ రెచ్చిపోతారు. మల్లిక మాట్లాడుతూ కలిసుందాం కలిసుందాం అని అందరినీ ఇక్కడే పెట్టారు. ఇప్పుడు ఉండటానికి ఇల్లే లేకుండా పోతుంది.చూడండి బావగారు మీరు ఈ అప్పు చేశారు కనుక మీరే కట్టండి మాకు ఏ మాత్రం సంబంధం లేదు అని అంటాడు. అఖిల్ కూడా చిన్న వదిన చెప్పిందే కరెక్ట్ మాకు ఈ అప్పుతో ఏ మాత్రం సంబంధం లేదు అని రామాను చాలా అపార్థం చేసుకొని వెళ్తారు. మరోవైపు రామ గదిలోకి వెళ్లి ఈ విషయాలన్నీ గుర్తుచేసుకొని బాధపడతాడు.
అదే సమయంలో జానకి అక్కడికి వెళ్లినేను కేవలం తమ్ముడికి ఉద్యోగం రావాలి వాడి భవిష్యత్తు బాగుండాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. అని చెప్పి బాధపడగా అందుకే రామ గారు నేను అత్తయ్యతో ఈ విషయం చెబుతాను అంటే మీరు అడ్డుకున్నారు ఆ ఒక్క నిజం దాచడమే ఇప్పుడు మిమ్మల్ని అబద్ధం చేస్తుంది అంటూ రామాను ఓదారుస్తుంది.ఆరోజు నేను అమ్మకు చెప్పే సమయం కూడా లేదు జానకి గారు ఇలా జరుగుతుందని ఊహించలేదు అని రామా బాధపడతాడు.మరోవైపు బావగారు నీకోసమే కదా అఖిల్ ఇలా చేస్తుంది ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నావు అని జెస్సి అనడంతో మరోసారి రామా జానకిని తప్పుపడతాడు.
మల్లికా వదిన చెప్పిన విధంగానే అన్నయ్య ఏదో ప్రాపర్టీ కొనే ఉంటారు వాళ్ళు నా ఉద్యోగం కోసం ఖర్చు చేయలేదు అని వారిని అపార్థం చేసుకుంటారు. ఇక రామ వెళ్లి గోవిందరాజు కాళ్ళ మీద పడి బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన జ్ఞానంభ రామాని అపార్థం చేసుకొని తిడుతుంది. క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు నాకు తెలియకుండా ఈ ఇంటి తాళాలు తాకట్టు పెట్టడం నువ్వు చేసిన తప్పు.నేను నీ బైక్ ఎంతో నమ్మకం పెట్టుకున్నాను అయితే నీకు పెళ్లి అయిన మరుక్షణం నుంచి నువ్వు ఎన్నో విషయాలను నా దగ్గర దాచి నా నమ్మకాన్ని వమ్ము చేశావు.చదువుకున్న పెళ్ళాం వస్తే ఎక్కడ కుటుంబం ముక్కలవుతుందో అని నేను బాధపడ్డాను కానీ నువ్వు నీ పెళ్ళాం విషయంలో అన్ని దాచినన్ని మోసం చేశావు అంటూ జానకిని కూడా అనుమాన పడుతుంది జ్ఞానంభ ఇలా కుటుంబ సభ్యులందరూ కూడా రామా జానకిని అపార్థం చేసుకోవడంతో ఇద్దరూ ఎంతో బాధపడతారు.