ఇంట్లో పగిలిన దేవుని పటాలకు పూజ చేస్తే ఇంత అరిష్టమా.. అలాంటి సమస్యలు వస్తాయా?

మనలో చాలామంది ఇంట్లో దేవుని పాటలు పాతబడినా, పగిలినా అలాగే పూజలు చేస్తూ ఉంటారు. పూజగదిలో ఎక్కువ ఫోటోలు పెట్టుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. అయితే దేవునికి మరీ ఎక్కువగా పూజలు చేయడం కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు. పగిలిపోయిన, పాతబడిన పటాలను పూజిస్తే చెడు ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని పండితులు చెబుతున్నారు.

పగిలిన ఫోటోలను పడేయకుండా ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయడం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. పటాలకు బూజు పడితే వెంటనే శుభ్రం చేస్తే మంచిది. పగిలిన దేవుడి ఫోటోలను ఇంట్లో ఉంచడం వల్ల కీడు జరుగుతుందని చెప్పవచ్చు. విరిగిపోయిన విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కుటుంబ సభ్యులకు హాని కలిగే అవకాశాలు అయితే ఉంటాయి.

పగిలిన పటాలను ఇంట్లో ఉంచి పూజలు చేస్తే మహా పాపమని పండితులు వెల్లడిస్తున్నారు. దేవుడి గదిని శుభ్రంగా ఉంచుకోవాలని వంకర తిరిగిన, విరిగిన పూజా సామగ్రి కూడా దేవుని గదిలో ఉంచుకోవద్దని పండితులు సూచనలు చేస్తున్నారు. పూజ గదిలో వేటిని ఉంచాలో వేటిని ఉంచకూడదో తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే అనుకూల ఫలితాలను పొందే ఛాన్స్ ఉంటుంది.

వారానికి ఒకసారైన శుభ్రంగా ఉండి దేవునికి పూజ చేయడం ద్వారా శుభ ఫలితాలు దక్కే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. దేవునికి పూజ చేయడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి. అయితే పూజా నియమాలను పాటిస్తూ పూజలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. వీలున్న వాళ్లు అప్పుడప్పుడూ గుడికి వెళ్లి దేవుడిని పూజించడం వల్ల మరింత మెరుగ్గా అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.