నా కోడలైనా సరే నన్ను అత్త అంటే ఒప్పుకోను… అనసూయ!

బుల్లితెర గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలియని వారంటూ ఉండరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ బుల్లితెర మీద ప్రసారమైన అనేక టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరించింది. ఈ క్రమంలో సినిమాలలో అవకాశాలు రావడంతో సినిమా రంగంలో అడుగుపెట్టిన అనసూయ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా మంచి గుర్తింపు పొందింది. ఇలా ఒకవైపు వరుస టీవీ షోలు చేస్తూ.. మరొకవైపు వరస సినిమాలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అనసూయ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే పోస్టుల వల్ల ఆమె విమర్శలు ఎదుర్కోవల్సి వస్తోంది.

ఇటీవల లైగర్ సినిమా ప్లాప్ అయిన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ పై నెటిజన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఆంటీ ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. దీంతో అనసూయ కూడా ఇలా తన గురించి ఏజ్ షేవింగ్ చేసిన వారి స్క్రీన్ షాట్ తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. అయితే నెటిజన్స్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇంకా ఎక్కువగా ట్రోల్ చేశారు. ఇక ఈ విషయంపై నటుడు బ్రహ్మాజీ, సుమ కూడా ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేశారు. కొన్ని రోజులు పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆంటీ అనే పదం వినిపించింది. అయితే కొన్నిరోజులుగా ఈ వివాదం కొంత సర్డుమనిగినట్టు తెలుస్తొంది.

ఇదిలా ఉండగా యాంకర్ సుమ నిర్వహిస్తున్న ” క్రేజీ కిచెన్ ” వంటల కార్యక్రమంలో అనసూయ సందడి చేసింది.ఈ వంటల కార్యక్రమంలో అనసూయ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ తనకు వంటలు చేయడం బాగా వచ్చు అని ఈ షో ద్వారా ద్వారా అది నిరూపించుకుంటానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మరొక సందర్భంలో అనసూయ ఈ అత్తా కోడల్ల రిలేషన్ ఎక్కడైనా ఇలాగే ఉంటుందా లేక తెలుగు కోడలు బిహారీ అత్త మధ్య మాత్రమే ఇలా ఉంటుందా అని సుమా ప్రశ్నించింది.

ఈ క్రమంలో అనసూయ స్పందిస్తూ… నిజంగా నాకు ఈ అత్త పిత్త అని పిలిపించుకోవడం అసలు ఇష్టం లేదు. స్టైల్ గా నన్ను అనసూయ, అను అని పిలిస్తే చాలు. ఆఖరికి నా కోడలైన కూడా నన్ను అత్త అని పిలిస్తే నేను ఒప్పుకోను అంటూ సమాధానం చెప్పింది. ఇలా అనసూయ మరొకసారి ఆంటీ అనే వివాదం గురించి స్పందించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.