ఆ సింగర్ భర్తతో కలసి రష్మి చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

బుల్లితెర అందాల యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట చిన్న చిన్న సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన రష్మీ ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా అవకాశం దక్కించుకుంది. ఇక జబర్దస్త్ వేదిక మీద రష్మీ తన యాంకరింగ్ తో పాటు అందాలు ఆరబోస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొని హాట్ యాంకర్ గా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి మూడు షోలలో రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.

ఇలా ఒకవైపు టీవీ షో లో యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమాలలో కూడా హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది. అయితే సినిమాల వల్ల రష్మి కి సరైన గుర్తింపు లభించలేదు. అయినప్పటికీ వెండితెరపై కూడా తన సత్తా నిరూపించుకోవాలని సినిమాలలో నటిస్తూ తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో సింగర్ గీత మాధురి భర్త నందు హీరోగా నటించిన ” బొమ్మ బ్లాక్ బస్టర్” అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే గతంలో సిద్దు జొన్నలగడ్డతో కలిసి గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో సిద్దు తో కలసి రష్మి చేసిన రొమాన్స్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అయ్యాయి.

ఇక ఇప్పుడు నందుతో కలసి జంటగా నటించిన ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో కూడా నందు, రష్మి చాలా రొమాన్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రష్మి, నందు మద్య బెడ్ రూమ్ లో జరిగిన రొమాంటిక్ సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో, ట్రైలర్ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతె కాకుండా ఈ సినిమాకి కొత్త తరహాలో ప్రమోషన్ చేయటంతో సినిమా మీద ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో అయినా రష్మి హీరోయిన్ గా హిట్ అందుకుంటుందో? లేదో? చూడాలి మరి.