శృతిమీరిన హైపర్ ఆది పంచులు.. నరేష్ పై అలాంటి వ్యాఖ్యలు చేస్తూ..?

తెలుగు బుల్లితెర పై అవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో ఈ మధ్యకాలంలో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ అయ్యాయి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు జబర్దస్త్ కమెడియన్లు స్కిట్ లలో భాగంగా డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా హైపర్ ఆది తన స్కిట్ లో వేసే ప్రతి ఒక్క పంచ్ కూడా డబ్బులు మీనింగ్ వచ్చే విధంగా పంచులు వేస్తున్నాడు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో వార్తలు వినిపించినప్పటికీ హైపర్ ఆది మాత్రం పద్ధతిని మార్చుకోవడం లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షో, జబర్దస్త్ ఎక్కడ వెళ్లినా కూడా హైపర్ ఆది తన డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్నాడు.

కొన్నిసార్లు షోకి వచ్చే పలువురు సెలబ్రిటీల పై కూడా తనకు ఇష్టం వచ్చిన విధంగా పంచులు వేస్తున్నాడు. ఈ విషయంపై నెటిజన్స్ అభిమానులు హైపర్ ఆది పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అయితే హైపర్ ఆది స్కిట్స్ ని చాలామంది అసహ్యించుకుంటున్నారు. ఎందుకంటే స్కిట్ లో కొత్త సెలబ్రిటీలను పరిచయం చేస్తూనే వారి పై కూడా డబ్బులు మీనింగ్ డైలాగులు వేస్తున్నాడు. ఇకపోతే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా హైపర్ ఆది ఎక్కువగా నరేశ్ తో స్కిట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి స్కిట్లో కూడా నరేష్ హైట్ గురించి అవమానించే విధంగా డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్నాడు హైపర్ ఆది.

పొట్టిగా ఉన్నాడు అని డైరెక్ట్ గా మాట్లాడకుండా నరేష్ లో ఉన్న లోపాన్ని పదేపదే ఎద్దేవా చేస్తూ మంచి విధంగా డబుల్ మీనింగ్ డైలాగులతో అంచులు వేయడంతో హైపర్ ఆది పై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతూ విమర్శలను గుర్తిస్తున్నారు. పదేపదే పొట్టివాడు, మ్యాటర్ లేదు, అన్ని చిన్నవే అంటూ డబుల్ మీనింగ్ అర్థాలు వచ్చే విధంగా పంచులు వేస్తున్నాడు. అయితే హైపర్ ఆది శృతిమించిన పంచులు, వెకిలి చేష్టలు ఒక వర్గం వారిని తీవ్రంగా అవమానపరిచినట్లుగా ఉన్నాయి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే డబ్బులు మీనింగ్ డైలాగులు కేవలం నరేష్ని మాత్రమే కాకుండా అందరినీ అన్నట్లుగా కొందరు భావిస్తున్నారట. దీంతోఈ విషయం పట్ల హైపర్ ఆది తొందరలోనే ఓ కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల దసరా పండుగ రోజు జరిగిన ఈవెంట్లో బాగా నరేష్ని తీవ్రంగా అవమానిస్తూ ఎప్పటిలాగే పంచులు వేసిన విషయం తెలిసిందే. అప్పుడు నరేష్ హైపర్ ఆది పంచులకు కాస్త ఇబ్బంది పడినట్లు అనిపిస్తోంది. అయినా కూడా పైకి నవ్వుతూ దాన్ని కవర్ చేసుకున్నాడు నరేష్. తాజాగా ఆది చేసిన వ్యాఖ్యలు నరేష్ తో పాటు నరేష్ వంటి ఎంతో మంది శారీరక వికలాంగులను అవమానించినట్లుగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మరి ఈ విషయంపై హైపర్ ఆది ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.