రోజా గారి వల్లే త్వరగా పెళ్లి చేసుకోబోతున్నాం… అసలు విషయం బయటపెట్టిన జోర్దార్ సుజాత!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో రాకేష్ కూడా ఒకరు. ఎంతోకాలంగా జబర్దస్త్ లో చిన్న పిల్లలతో కలిసి స్కిట్లు చేస్తూ అందరిని నవ్విస్తున్న రాకేష్ జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. అయితే రేటింగ్స్ కోసం మల్లెమాలవారు సుదీర్ రష్మి, వర్ష ఇమాన్యుల్ లాగే రాకేష్ సుజాత మధ్య కూడా లవ్ ట్రాక్ క్రియేట్ చేశారు.

అయితే ఇలా వీరి మధ్య ఆన్ స్క్రీన్ మీద ఉన్న ప్రేమ జీవితంలో కూడా నిజమయింది. ఇద్దరూ కలిసి జబర్దస్త్ స్టేజి మీద స్కిట్లు చేస్తూ ప్రేమలో పడ్డారు . అయితే మొదట అందరిలాగే మీరు కూడా కేవలం రేటింగ్స్ కోసం మాత్రమే ఇలా నటిస్తున్నారని అనుకున్నారు. కానీ వీరిద్దరూ నిజంగానే ప్రేమలో పడి ఈ విషయాన్ని వాలెంటైన్స్ డే రోజున ప్రకటించారు. చాలాకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటూ తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. తొందర్లోనే ఈ జంట వివాహ బంధంతో ఒకటి కానుంది.

అయితే తాజాగా తమ పెళ్లి గురించి జోర్దార్ సుజాత స్వయంగా అనౌన్స్ చేసింది. రోజా గారు చెప్పడం వల్లే రాకేష్ ప్రేమను గుర్తించాలని ఈ సందర్భంగా సుజాత వెల్లడించింది. ఈ క్రమంలో ఇటీవల తిరుపతి వెళుతూ వెళ్లేదారిలో రోజా ఇంటికి వెళ్లి అక్కడ ఆమెను కలిసి రోజా వద్ద పెళ్లి గురించి చర్చలు జరిపినట్లు సుజాత వెల్లడించింది. రోజా ఇంట్లో రాకేష్ తో కలిసి వీడియో చేస్తూ రోజాగారు లేకుంటే రాకేష్‌తో తన పెళ్లి అనౌన్స్ మెంట్ కూడా ఇంత త్వరగా వచ్చేది కాదని ఈ సందర్భంగా వెల్లడించింది. త్వరలోనే పెళ్లి ఎప్పుడు ఏంటి అనేది కూడా చెబుతామంది సుజాత.