అప్పు కట్ట లేకపోయినా రామా….. కట్టుబట్టలతో రోడ్డుపై పడ్డ కుటుంబం!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే… తెల్లవారితే ఏం జరుగుతుందోనని జ్ఞానంబ బాధపడుతూ కూర్చుంటుంది.ఇల్లంటే నీడ మాత్రమే అనుకున్నాం కానీ కుటుంబం మొత్తాన్ని ముందుకు నడిపించే ధైర్యం ఈ వయసులో ముగ్గురు కొడుకులు కోడలను తీసుకొని నేను ఏ పంచన చేరాలి అని బాధపడుతూ ఉంటుంది. అమ్మవారి ఎలాగైనా ఈ కష్టం నుంచి బయటపడేయాలని జ్ఞానాంబ చెప్పగా గోవిందరాజులు రాముడు డబ్బు సర్దుతానని వెళ్ళాడు కదా ఏం కాదులే అని చెబుతాడు.

మరోవైపు జానకి రామ కోసం బయట ఎదురు చూస్తూ అలాగే అక్కడే నిద్రపోతుంది. అయితే చికిత వచ్చి నిద్ర లేపడంతో జానకి కంగారుగా వెళ్లి రామాకు ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే అదే సమయంలో మల్లిక చేసిన మోసానికి మొహం చూపించలేక ఎక్కడికైనా పారిపోయారేమో అని దెప్పి పొడుస్తుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా రాముడు బంగారం అంటూ గోవిందరాజులు చెప్పడంతో విష్ణు ఇన్ని రోజులు ఇంటి భారము మొత్తం అన్నయ్య మోస్తున్నారనుకుంటే ఇప్పుడు ఇల్లే లేకుండా చేశారు ఇప్పుడు భాస్కర్ రావు వస్తే ఏమని సమాధానం చెప్పాలి అంటాడు అదే సమయంలో వడ్డీ వ్యాపారి ఇంట్లోకి అడుగు పెడతారు.

డబ్బులు సర్దుబాటు అయ్యాయా అని అడగడంతో రాముడు వెళ్లారని చెప్పగా అంతలోపే రామ అక్కడికి వచ్చి అందరి దగ్గర డబ్బు కోసం ప్రయత్నాలు చేశాను కానీ ఎవరు ఇవ్వలేదు అని చెబుతాడు. మీ స్వలాభం కోసం అప్పు చేసి ఇప్పుడు డబ్బు దొరకలేదు అంటే ఎలా నమ్ముతాము అని మల్లికా మాట్లాడటంతో ఉమ్మడి ఆస్తిని వెనుకేసుకొచ్చే అంత చౌకబారు మనుషులం కాదు మేము అంటూ జానకి సమాధానం చెబుతుంది.డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేయాలని ముందుగానే చెప్పం కదా ఏమంటారు జ్ఞానంభ గారు మాట తప్పుతున్నారా అనడంతో ఇప్పుడే ఇల్లు ఖాళీ చేస్తున్నామని ఆమె చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.

మరికొంత సమయం కావాలని రామ అడిగినప్పటికీ భాస్కరరావు ఏమాత్రం సమయం ఇవ్వడు అంతేకాకుండా విష్ణు కోసం చేసిన ఐదు లక్షల అప్పుకు వడ్డీకి తన కారును తాకట్టు పెట్టుకుంటానని అలాగే 20 లక్షల వడ్డీ 40 వేల రూపాయలకు స్వీట్ షాప్ కూడా తాకట్టు పెట్టుకుంటానని డబ్బు కట్టి వాటిని విడిపించుకోవాలని చెబుతారు. దీంతో అందరూ కాగితాల పై సంతకాలు పెడుతారు. దీంతో జ్ఞానంభ కుటుంబం కట్టుబట్టలతో రోడ్డు పైకి వస్తారు.