కల నెరవేరబోతుందంటూ ఎమోషనల్ అయినా డాక్టర్ బాబు భార్య.. ?

బుల్లితెర నటీనటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిరుపమ్, మంజుల దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రముఖి సీరియల్ ద్వారా అందరికీ వీరిద్దరు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈ జంట అనంతరం ప్రేమలో పడి పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకున్నారు. ఇలా నిజ జీవితంలో దంపతులుగా స్థిరపడిన వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నారు. ఇకపోతే నిరుపమ్ కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా గుర్తింపు పొందారు.

ఇకపోతే కార్తీకదీపం సీరియల్ నుంచి దూరమైన డాక్టర్ బాబు ప్రస్తుతం తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా మంజుల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. తన తల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లలేనని అయితే ఇద్దరు అక్కయ్యలు విదేశాలలో ఉన్నారని ఇకపోతే తన తల్లిదండ్రులకు ఉండడానికి ఒక సొంత ఇల్లు కొనివ్వాలన్నదే తన కళ అని ఆకల తొందర్లోనే నెరవేరబోతుంది అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.

అయితే తాను తన తల్లిదండ్రులకు కొత్త ఇంటిని కొనివ్వడానికి తన భర్త అత్తయ్య సహకారం ఎంతో ఉందని వారి వల్లే ఇదంతా జరిగింది అంటూ మంజుల ఎమోషనల్ అయ్యారు. అయితే తన తల్లిదండ్రులకు తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేసామని ఈమె తన తల్లిదండ్రుల కోసం ఇంటిని కొనుగోలు చేయడానికి వెళ్తూ చేసిన ఈ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఎంతోమంది డాక్టర్ బాబు మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.