బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ ఏం జరిగింది అనే విషయానికి వస్తే..ఆనందరావు మాట్లాడుతూ దీప కార్తిక్ ఇక లేనట్టేనా అంటూ బాధపడగా వెంటనే సౌందర్య లేదు నేను ఇక్కడికి రాకముందే ఇంద్రుడు చంద్రమ్మ సౌర్యను తీసుకొని ఊరి వదిలి వెళ్ళిపోయారు. అంటే వారు ఎవరినో చూసి భయపడ్డారు అప్పుడు మన కొడుకు కోడలు బ్రతికి ఉన్నట్టే కదా అంటూ సౌందర్య చెబుతుంది. ఆ సమయంలో హిమ అమ్మ నాన్నలు బతికే ఉన్నారంటే అది మన అదృష్టం. సౌర కూడా మన చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోతుంది.
మరోవైపు హాస్పిటల్ బెడ్ పై ఉన్నటువంటి దీపను చూసి కార్తీక్ ఎంతో ఎమోషనల్ అవుతారు.ఒక్క క్షణం నువ్వు కనిపించకపోయేసరికి నా ప్రాణం పోయినట్టు అయింది. నీకేమవుతుందోనని చాలా భయంగా ఉంది అంటూ కార్తీక్ ఎమోషనల్ అవుతారు. అదే సమయంలో డాక్టర్ వచ్చి అంతా ఓకే కదా ఆపరేషన్ చేద్దామా అంటూ కార్తీక్ చెప్పగా వద్దు మరో రెండు రోజులాగి చేద్దామని డాక్టర్ చెబుతారు. అదేంటి అని కార్తీక్ అడగగా పేషంట్ కన్నా ఆపరేషన్ చేసే డాక్టర్ కండిషన్ సరిగా ఉండాలి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆపరేషన్ అంత సక్సెస్ అవుతుంది.
ఇక రోడ్డుపై దీపా అలా పడి ఉండడం చూసి అదే విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు పెళ్లి అయిన క్షణం నుంచి నిన్ను ఏ రోజు సంతోషంగా చూసుకోలేదు అంటూ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు మోనిత కార్తీక్ ఎక్కడికి వెళ్లి ఉంటాడు ఆ దీపా లేదు కార్తీక్ లేదు ఇద్దరు కలిసి వెళ్లిపోయారా.. కార్తీక్ కి గతం గుర్తుకు వచ్చిందా?సౌర్య కనిపించడంతో ఇద్దరు హైదరాబాద్ వెళ్ళిపోయారని ఆలోచిస్తూ వెంటనే బట్టల సర్దుకుని తాను కూడా హైదరాబాద్ వెళ్లడానికి తయారవుతుంది.
అంతలోగా అక్కడ ఒక ఆమెకు ఫోన్ చేసి బోటిక్ అమ్మేయమని చెప్పగా మరో నాలుగు రోజులు ఆగి చూడండి మేడం అంటూ చెప్పడంతో నాలుగు రోజులు కాదు కదా నాలుగు క్షణాలు కూడా ఉండలేనని చెబుతుంది. అంతలోపే సౌందర్య రావడంతో మౌనిత షాక్ అవుతుంది.ఎక్కడికి బయలుదేరుతున్నావ్ నా తల పగల కొట్టావు అంటే నీ ఇంట్లో నేను చూడకూడదు ఏదో ఉంది అంటూ ఇల్లు మొత్తం వెతుకుతుంది. అయితే ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో ఎందుకు ఆంటీ నా లైఫ్ డిస్టర్బ్ చేస్తున్నారు అంటూ తనని తోసి లోపలికి వెళ్లి తలుపులు పెట్టుకుంటుంది.
సౌందర్య తలుపులు కొట్టడంతో ఏకంగా తనకు గన్ గురిపెట్టి.. మొన్న కొట్టాను.ఇప్పుడు ప్రాణాలు కూడా తీసేస్తాను ఎందుకు నా లైఫ్ డిస్టర్బ్ చేస్తున్నారు. మీ కొడుకు కోడలు ఎలాగో లేరు కదా మరి నా జీవితంలోకి అనవసరంగా ఎందుకు వస్తున్నారు అంటూ మండిపడుతుంది.సౌందర్య మోనిత చేతిలో ఉన్న గన్ లాక్కొని తనకు గురిపెట్టి ఎవరూ లేనప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్తున్నావ్ కదా నేను వస్తాను అంటుంది. మరోవైపు శౌర్య అమ్మానాన్నలు ఎక్కడున్నారు అని బాధపడుతూ ఉండగా చంద్రమ్మ పాలు తీసుకువచ్చి తాగమని శౌర్యకిస్తుంది. ఇంద్రుడు పడుకొని ఉంటాడు ఆ సమయంలో దీప అలా పడిపోయి ఉండడం గుర్తుకు తెచ్చుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. మరోవైపు కార్తీక్ దీపకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.