బిగ్ బాస్6 లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమానికి త్వరలోనే ముహూర్తం ఫిక్స్ కానుంది.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారమయ్యే తేదీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ కార్యక్రమం సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా నిర్వాహకులు పూర్తి చేశారని తెలుస్తోంది.ఇకపోతే ఎప్పటిలాగే ఈ కార్యక్రమంలో ఈసారి కూడా సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారితోపాటు ప్రముఖ యాంకర్లు బుల్లితెర నటీనటులను కూడా ఈ కార్యక్రమంలో తీసుకురానున్నారు.

వీరితోపాటు ఈ సీజన్ లో ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ ఉదయభాను పాల్గొంటున్నట్లు సమాచారం. ఈమెను గత సీజన్లోనే కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం బిగ్ బాస్ నిర్వాహకులు కల్పించినప్పటికీ ఈమె మాత్రం కొన్ని కారణాలవల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. అందుకే ఈ సీజన్ లో ఎలాగైనా తనని ఈ కార్యక్రమానికి తీసుకురావాలన్న ఉద్దేశంతో బిగ్ బాస్ నిర్వాహకులు తనకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం.

ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లలో ఉదయభాను అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని ఈమెకు ఒక్కో ఎపిసోడ్ కు లక్షలలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో 17 మంది కంటెస్టెంట్లను నిర్వాహకులు ఎంపిక చేసినట్లు సమాచారం.ఒకేసారి 15 మందిని హౌస్ లోకి పంపించగా మిగతా ఇద్దరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ విషయాల గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది.