లేడి కండక్టర్ కి మల్లెమాల వారు ఇచ్చిన పారితోషికం ఎంతో తెలుసా..?

కొత్తవారి టాలెంట్ ను ఎంకరేజ్ చేయటంలో ఈటీవీ ఎప్పుడు ముందు ఉంటుంది. ఈటీవీలో ప్రసారమవుతున్న అనేక టీవీ షోల ద్వారా ఎప్పుడు కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ వారిలో ఉన్న టాలెంట్ ని రూపించుకొనే అవకాశాలను కల్పిస్తోంది. ఇలా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, జాతి రత్నాలు, అదుర్స్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు ద్వారా ఎంతోమంది వారిలో ఉన్న టాలెంట్ ని నిరూపించుకొని ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. కొంతకాలంగా ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ ఆ షో రేటింగ్స్ పెంచడమే కాకుండా వారికి మంచి గుర్తింపు తెచ్చిపెడుతోంది.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో సుందరి చేసిన గాజువాక ఆర్టీసీ డిపో లేడీ కండక్టర్ తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది. లేడీ కండక్టర్ చేసిన మాస్ డాన్స్ కి అక్కడ ఉన్న వారు విజిల్స్ వేస్తూ, కేకలు వేస్తూ రెచ్చిపోయారు ఇక ఆమె డాన్స్ చూసిన ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఇలా తన డాన్స్ తో ఒక్కరోజులోనే సెలబ్రిటీగా మారిపోయింది. దీంతో ఈ లేడీ కండక్టర్ కి సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశాలు కూడా వస్తాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీదేవీ డ్రామా కంపెనీ లో సందడి చేసినందుకు మంచి గుర్తింపుతో పాటు అధిక మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.

ఈ లేడీ కండక్టర్ శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం రెండు రోజుల సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు మల్లెమాలవారు ఆమెకి దాదాపు రెండున్నర లక్షల వరకు పారితోషకం ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇలా అధిక మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల వచ్చిన గుర్తింపుతో సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు అందుకొనుంది. ఇలా ఎంతోమంది సామాన్యులను ఈ షో సెలబ్రిటీలు గా మార్చేసింది. ఇప్పటికి జబర్థస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు, సీరియల్ నటి నటులతో పాటు ఎంతోమంది టాలెంట్ ఉన్న సామాన్యులకు కూడ శ్రీదేవీ డ్రామా కంపెనీ అవకాశం కల్పిస్తోంది.