అలీతో సరదగా షో కోసం భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న అలీ ఎంతో తెలుసా?

టాలివుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కామెడియన్ గా గుర్తింపు పొందిన అలీ గురించి తెలియనివారు ఉండరు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ కొన్ని వందల సినిమాలలో నటించి తన కామెడీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అలీ ప్రస్తుతం సినిమాలకు కొంచం దూరంగా ఉంటూ అడపాదడపా సినిమాలలో నటిస్తున్నాడు. ఇలా కామెడియన్ గా గుర్తింపు పొందిన అలీ ఈటీవీలో ప్రసారమవుతున్న అలీ తో సరదాగా అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

ఈటీవీలో అలీ సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ షో లో పాల్గొనే సెలెబ్రిటీల గురించి ఎవరికీ తెలియని విషయాలు కూడా బయటపెడతాడు. అంతే కాకుండా ఈ షో కి హాజరైన సెలెబ్రిటీల పట్ల అలీ వ్యవహరించే తీరు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఈ షో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఇలా ఎన్నో ఏళ్లుగా ఈ షోకి హోస్ట్ వ్యవహరిస్తున్న అలీ ఈ షో కోసం తీసుకొని రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఆలీతో సరదాగా అనే షో కోసం ఆలీ ఒక ఎపిసోడ్ కోసం దాదాపు రూ. 6.50 లక్షల వరకు రెమ్యునరేషన్ అండుకుంటున్నట్లు తెలుస్తొంది. ఇక ఇందులో కొంత డబ్బు టాక్స్ లు పోగ మరికొంత తన పర్సనల్ స్టాఫ్ కి ఇవ్వగా.. నెలకి ఐదు లక్షల వరకు మిగులుతుందట. ఇలా నెలలో మూడు లేదా నాలుగు రోజులు అలీ ఈ కార్యక్రమానికి కేటాయిస్తాడు.దీంతో ఈ షో నుండి నెలకి దాదాపు 20 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నట్లు సమాచారం.