లాస్య మాయలో పడిన దివ్య…. దివ్యను చూసి షాక్ అయిన తులసి!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే… నందు బాధగా ఇంటికి రావడంతో అందరూ ఏం జరిగిందని ఆలోచిస్తూ ఉంటారు.మీరు వచ్చినట్టు కార్ సౌండ్ కూడా రాలేదు కదా డాడ్ అనడంతో ఇంట్లో వాళ్లే నన్ను నమ్మడం లేదు ఇక బ్యాంక్ వాళ్ళు నన్ను ఏమి నమ్ముతారు ఈఎంఐ కట్టలేదని మధ్యలోనే ఆపి కార్ తీసుకెళ్లిపోయారు అని బాధపడతారు.కాలం కలిసి రానప్పుడు మనకి ఏది కలిసి రాదు అలాగని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు అంటూ తులసి వేదాలు చెబుతుంది.

ఇక నడిచి రావడంతో కాళ్లు నొప్పులు చేయడంతో లాస్య నందు కాలు ఒత్తుతూ డ్రామా చేస్తుంది.మనకు లక్షన్నర అప్పు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నందు అనడంతో ఒక్కసారిగా నందు బిత్తరపోయి మనకు అప్పిచ్చేవాళ్ళు ఎవరున్నారు అయినా అంత అప్పు ఎందుకు అని అడగడంతో దివ్యకు లాప్టాప్ కొనిస్తానని మాట ఇచ్చాను అని చెప్పగా ఇదే దారిని పోయే కంప తగిలించుకోవడం అంటే అని చిరాకు పడతాడు.మనకు అప్పు కావాలంటే నిన్ను ఎక్కడైనా తాకట్టు పెట్టాలి అని నందు చిరాకు పడతాడు పొద్దున హారతి ఇచ్చి ఎదురు వచ్చావ్ కారు పాయా నా జాబ్ ఇంటర్వ్యూ కూడా వెళ్లిపోయింది అంటూ చిరాకు పడతాడు.

మరోవైపు లాస్య తనకు కొత్త లాప్టాప్ కొనిచ్చే వరకు తనది ఉపయోగించుకోమని దివ్యకు తన లాప్టాప్ ఇవ్వడంతో దివ్య సంతోష పడుతూ మీరు మంచి వాళ్ళు ఆంటీ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను అని మాట్లాడుతుంది.అలాగే తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని తాను వెళ్ళాలి అని దివ్య చెప్పగా స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి వెళ్ళిపో అనడంతో థాంక్యూ సో మచ్ ఆంటీ అంటూ పార్టీకి బయలుదేరుతుంది. లాస్య మాత్రం దివ్య ను పూర్తిగా తన మాయలో వేసుకున్నానని సంతోషపడుతుంది.

మరోవైపు తులసి తన కోడలు శృతిని వాకింగ్ చేపిస్తూ ఉంటుంది. ఇలా ఇద్దరు వాకింగ్ పూర్తి అయిన తర్వాత కూర్చుని మాట్లాడుతూ ఉండగా అక్కడికి దివ్య రావడంతో దివ్య అవతారం చూసి ఒక్కసారిగా తులసి షాక్ అవుతుంది.దీంతో తులసి ఎక్కడికి వెళ్తున్నావ్ అంటూ గట్టిగా అరవడంతో దివ్య కంగారు పడుతుంది. అది గమనించిన తులసి చాలా ప్రశాంతంగా ఈ డ్రెస్ లో చాలా బొద్దుగా ఉన్నావ్ ఎక్కడికి వెళ్తున్నావ్ అంటూ అసలు విషయం తెలుసుకుంటుంది. అదే సమయంలో లాస్య అక్కడికి వచ్చి దివ్య తులసి విషయంలో కలుగజేసుకొని మాట్లాడుతుంది.