రేవంత్ ఒక సినీ గాయకుడు. సినిమాలలో దాదాపు 200 పైగా పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి లో మనోహరి పాట ఇతనికి మంచి గుర్తింపు తెచ్చింది. ఈయన 1990లో శ్రీకాకుళంలో జన్మించాడు. విద్యాభ్యాసం అంతా శ్రీకాకుళం, విశాఖపట్నంలో జరిగింది. 2022 లో అన్విత ను వివాహం చేసుకున్నాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తాతయ్య, మామయ్యల దగ్గర ఎక్కువగా పెరిగాడు.
తన మామయ్యకు పాటలంటే ఎంతో ఇష్టం ఆ విధంగా ఈయనకు కూడా పాటలపై ఇష్టంతో ఊర్లో జరిగే కార్యక్రమాలలో పాటలు పాడేవాడు. అలా పాటలు పాడడం నేర్చుకుని సొంతంగా పాకెట్ మనీ సంపాదించుకునేవాడు. రేవంత్ ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఒక అవకాశం వస్తే చెన్నై వెళ్లిపోయాడు. తర్వాత చిన్న చిన్న జాబులు చేస్తూ, ఆ డబ్బును పాకెట్ మనీ గా వాడుకుంటూ ఆడిషన్స్ కు వెళ్లేవాడు.
హిందీలో జలకతిక లాజ అనే పాటకు కో సింగర్ గా పాడడం జరిగింది. తెలుగులో మంచి మంచి సినిమాలలో రేవంత్ పాటలు పాడడం జరిగింది. మేం వయసుకు వచ్చాం సినిమాలో లవ్ యు అంటుంది అనే పాట, అర్జున్ రెడ్డి సినిమాలో ఊపిరి ఆగుతున్నది, సుప్రీం సినిమాలో అందం హిందులం, రఘువరన్ బీటెక్, కృష్ణార్జున యుద్ధం, బాహుబలి, ఆచార్య ఇలా ఎన్నో సినిమాలలో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నాడు రేవంత్.
2017లో ఐడల్-9 లో పాల్గొని టైటిల్ విన్నర్ గా నిలిచి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సచిన్ టెండుల్కర్ చేతుల మీదుగా విన్నర్ టైటిల్ ని కూడా తీసుకోవడం జరిగింది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఈయన వద్ద రెండు లగ్జరీ కార్లు, ఒక బైక్ ఉన్నాయి.
మొదట్లో అయితే ఒక్కో పాటకు 40 వెల నుండి 50 వేల వరకు పారితోషకం తీసుకునేవాడు. ప్రస్తుతం అయితే 80వేల నుండి లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు.