జబర్దస్త్ ను వీడి సుదీర్ తప్పు చేశాడా.. బుల్లితెరకు కనుమరుగైన సుడిగాలి సుదీర్!

మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన జీవితంలో ముందుకు కొనసాగుతున్నటువంటి సుడిగాలి సుదీర్ కు మల్లెమాలవారు సెలబ్రెటీ హోదా కల్పించారు.ఇలా మిమిక్రీ ఆర్టిస్ట్ గా తనలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తించిన మల్లెమాల సుదీర్ ను జబర్దస్త్ కార్యక్రమానికి పరిచయం చేశారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతున్నటువంటి సుధీర్ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా ఎంతో పేరు సంపాదించుకున్నారు.ఇలా టీమ్ లీడర్ గా కొనసాగుతూనే ఎంతో గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ అనంతరం మల్లెమాలవారు నిర్వహిస్తున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ విధంగా బుల్లితెర మెగాస్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వరుస అవకాశాలు అందుకొని దూసుకుపోతున్న సుడిగాలి సుదీర్ ఒక్కసారిగా మల్లెమాల కార్యక్రమాలు అన్నింటికి దూరమయ్యారు.జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి కూడా ఈయన తప్పుకున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన అనంతరం సుడిగాలి సుదీర్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మరోవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక ఈయన హీరోగా నటించిన వాంటెడ్ పండుగాడ్ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అలాగే స్టార్ మాలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమం కూడా పూర్తి అయింది. ఈ కార్యక్రమం అనంతరం సుడిగాలి సుధీర్ ఏ ఇతర కార్యక్రమాలలోనూ కనిపించలేదు. దీంతో ఈయనకు ఏ ఛానల్ లోనూ అవకాశాలు రాలేదా అనే సందేహం కలుగుతుంది.ఈ క్రమంలోనే కొందరు ఈ విషయంపై స్పందిస్తూ సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి తప్పు చేశారా అందుకే ఈయనకు ఏ ఛానల్ లో కూడా ఇప్పటివరకు అవకాశాలు రాలేదు అంటూ పెద్ద ఎత్తున సుదీర్ గురించి సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.