బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీలో అడుగుపెట్టి కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. జబర్దస్త్ ద్వారా కమెడియన్లుగా గుర్తింపు పొందిన చాలామంది హీరోలుగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.అలా కమెడియన్ స్థాయి నుండి హీరోగా మారిన వారిలో ధనరాజ్ కూడా ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ధన్ రాజ్ ఎన్నో సినిమాలలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఇలా సినిమాలు, టీవీ షోస్
లో సందడి చేస్తూ ప్రేక్షకులను నవ్వించిన ధనరాజ్ ఇప్పుడు హీరోగా మారిపోయాడు.
గరుడవేగ సినిమా ఫేమ్ అంజి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బుజ్జి ఇలా రా’ అనే సినిమా ద్వారా ధనరాజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాలో మరొక ప్రముఖ నటుడు, కమెడియన్ సునీల్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల హైదరాబాదులో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నాంది సినిమా దర్శకుడు విజయ్ కనకమెడల అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలో విజయ్ మాట్లాడుతూ తనతో ధనరాజ్ కి ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.
ఇండస్ట్రీలో తనకు పరిచయమైన మొదటి వ్యక్తి ధనరాజ్ అని, ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. ఇద్దరి మధ్య కూడా ఒరేయ్ బావ అని పిలుచుకొనేంత చనువు ఉందని విజయ్ వెల్లడించాడు ధనరాజ్ క్యారెక్టర్ల కోసం నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశాల కోసం ఎన్నో సినిమా ఆఫీసులు చుట్టూ తిరిగామని విజయ్ వెల్లడించాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన జీవితం మొదలుపెట్టి ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగిన ధనరాజ్ నటించిన సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ఇలా మాట్లాడటం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ధనరాజ్ కూడా స్టేజి మీదకి వచ్చి తనని హత్తుకొని కన్నీరు పెట్టుకున్నాడు.మేమిద్దరం ఒకరికొకరు స్నేహితులమని వాడు నా గురించి ఇలా మాట్లాడుతుంటే నాకు తెలియకుండానే నా కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి అంటూ ధనరాజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.