సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలోకి ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం హీరో హీరోయిన్లుగా స్థిరపడిన వారు ఉన్నారు.అలాగే మరికొందరు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వారికి ఇష్టమైన వృత్తిలో స్థిరపడిన వారు ఉన్నారు. ఇకపోతే తెలుగులో దేవుళ్ళు సినిమా ద్వారా అందరిని ఎంతగానో మెప్పించిన చైల్డ్ ఆర్టిస్ట్ నిత్య శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దేవుళ్ళు సినిమాలో ఎంతో అద్భుతంగా నటించిన ఈమె లిటిల్ సోల్జర్స్, చిన్ని చిన్ని ఆశ అనే సినిమాలలో ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్నారు. మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె 2015 వ సంవత్సరంలో దాగుడుమూతలు దండాకోర్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇలా పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈమె తాజాగా నిహారిక నిర్మాణంలో తెరకెక్కుతున్న హలో వరల్డ్ అనే సినిమాలో నటిస్తున్నారు.
తాజాగా చిత్ర బృందం సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరందరూ పెద్ద ఎత్తున సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఈ ప్రోమోలో నిత్యాశెట్టిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.దేవుళ్ళు సినిమాలో ఎంతో ముద్దు ముద్దు మాటలతో అందరిని సందడి చేసిన నిత్య శెట్టి ఇప్పుడు ఇలా తయారయిందా..అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిత్యాశెట్టికి సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వాన