యూట్యూబర్ తో పెళ్లికి రెడీ అయిన దేత్తడి హారిక… ఇంతకీ వరుడు ఎవరో తెలుసా..?

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది తమలో ఉన్న టాలెంట్ ని నిరూపించుకుంటూ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయిన వారిలో డేత్తడి హారిక కూడా ఒకరు. యూట్యూబ్ వీడియోలలో తెలంగాణ భాషలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్న హారిక బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో అభితో హారిక నడిపిన వ్యవహారంతో విమర్శలు ఎదుర్కొని నెగెటివిటీ మూట కట్టుకుంది.

ఈ క్రమంలో బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత హారిక అభిమానుల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం హారిక గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . తొందర్లోనే హారిక పెళ్లి పీటలు ఎక్కనుందని కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. యూట్యూబర్ గా ఫేమస్ అయిన హారిక తనకు బాగా తెలిసిన మరొక యూట్యూబ్ పెడతావ్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అయితే తన ప్రేమ విషయం సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్న హారిక పెద్దల అంగీకారంతో తొందరలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం.

అయితే హారిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి పూర్తి వివరాలు మాత్రం ఇప్పటివరకు తెలియటం లేదు. ఇదిలా ఉండగా కొంతకాలంగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై హారిక కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు. దీంతో ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే హారిక స్పందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ తో బిజీగా ఉంటున్న హారిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన అందమైన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఈ క్రమంలో సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకుంటుంది.