మరోసారి స్పృహ తప్పి పడిపోయిన దీప… నాకోసం దీప గుండె కొట్టుకొని అలసిపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్!

బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే..ఇంట్లోకి వెళ్లిన దీప కార్తీక తన తల్లిదండ్రులను చూసి ఆనందపడతారు. సౌందర్య కూడా ఏడుస్తూ ఉండగా ఇక ఏడవకు మమ్మీ మేము వచ్చాము కదా అంటూ కార్తీక్ చెబుతాడు.అప్పుడు ఆనందరావు ఏడవనిరా ఇన్ని రోజులు తన కళ్ళల్లో నుంచి బాధతో కూడిన కన్నీళ్లు వచ్చాయి ఇప్పుడు అవి ఆనందభాష్పాలు అంటూ చెప్పుకొస్తాడు.ఇంతకీ ఏం జరిగింది ఇన్ని రోజులు ఏమైపోయారు అంటూ అడగడంతో కార్తీక్ లోయలో పడటం గతం గుర్తుకు రాకపోవడం మోనిత చేసిన మోసం దీప పడిన కష్టాల గురించి చెప్పేస్తాడు.

ఇలా తెలుసుకున్న తర్వాత సౌర్య గురించి ప్రస్తావని రావడంతో శౌర్య ఎక్కడుంది అని అడగక వెంటనే దీప సౌర సౌర అంటూ కారులోనే స్పృహ తప్పి పడిపోతుంది. ఇదంతా కూడా దీప కలగంటుంది. ఇంటి వరకు కార్తీక్ కారు వచ్చినప్పటికీ లోపలికి వెళ్లకుండా దీప స్పృహ పడి తప్పి పడిపోవడంతో వెంటనే ఫ్లైట్లో తిరిగి హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఇక అక్కడ దీప రిపోర్ట్స్ చూసినటువంటి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

డాక్టర్ చారుశీల మాట్లాడుతూ ఇదే విషయం మీకు చెప్పాలని ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు.దీప గుండె బాగా దెబ్బతింది తనకు సర్జరీ కాదు గుండె మార్పిడి చేయాల్సి ఉంది అంటూ చారుశీల చెప్పడంతో కార్తీక్ కుమిలిపోతాడు. దీపకే ఎందుకు ఈ కష్టాలు తనని ఎప్పుడు సంతోషంగా ఉంచలేకపోయాను నాకోసమే దీప గుండె ఆరాటపడుతూ, నా నువ్వు వెతుకుతూ అలసిపోయింది అంటూ కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటారు.మీరు ధైర్యంగా ఉండాలి మీరు ధైర్యంగా ఉంటేనే తను కూడా ధైర్యంగా ఉంటుంది అని చారుశీల ధైర్యం చెబుతుంది.

అంతలోనే నర్స్ వచ్చి పేషెంట్ కి స్పృహ వచ్చిందని చెప్పడంతో నువ్వు వెళ్లి చార్సిలా నన్ను చూస్తే ఫ్లైట్లో అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామని పదేపదే ప్రశ్నలు వేస్తుంది అంటూ డాక్టర్ చెప్పి పంపిస్తారు.మరోవైపు సౌందర్య దీప కార్తిక్ ఫోటోలకు ఉన్న దండలు తీసేసి ఒకప్పుడు ఆశ మాత్రమే ఉండేది కానీ మౌనిత ప్రవర్తన వల్ల నాకు గట్టి నమ్మకం ఉంది మన కొడుకు కోడలు బతికే ఉన్నారని అంటూ ఆమె ఫోటోలు కూడా దండలు తీసేస్తుంది.రావడంతో ఎందుకు డాక్టర్ బాబు మనం ఇక్కడికి వచ్చాము అని అడగగా ఏం లేదని ఏదో అబద్దాలు చెప్పేస్తాడు.

మరోవైపు శౌర్యను వాళ్ళ అమ్మ నాన్నలకు తిరిగి చేయడం ఏమాత్రం ఇష్టం లేనటువంటి చంద్రమ్మ తనని మన దగ్గరే ఉంచుకుందామని చెప్పగా ఇంద్రుడు వినకుండా హైదరాబాద్ వెళ్లి తన అమ్మానాన్నలకు నేను తనని అప్పచెబుతాను అంటూ బయలుదేరుతాడు. ఇంకా చంద్రమ్మ ఏడుస్తూ ఉండగా ఎందుకు ఏడుస్తున్నావ్ పిన్ని బాబాయ్ ఊరికి వెళ్తుంటే అని జ్వాల అడుగుతుంది దాంతో ఇంద్రుడు తనకి ఏదో చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు.