11 ఏళ్ల కిందటే టీవీలో కనిపించిన కండక్టర్ ఝాన్సీ.. ఏ ఛానల్ లో కనిపించిందంటే..?

గాజువాక లేడీ కండక్టర్ ఝాన్సీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. గాజువాక చుట్టుపక్కల ప్రాంతాలలో శుభకార్యాలలో రికార్డ్ డాన్సులు వేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి మాత్రమే తెలిసిన ఝాన్సీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసిన ఝాన్సీ ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయింది. ప్రస్తుతం ఆమె బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో అవకాశాలు అందుకోవడమే కాకుండా వెండితెర మీద కూడా అవకాశాలు అందుకుంది.

అయితే ఝాన్సీ ఇలా టీవీలో కనిపించడం ఇది మొదటిసారి కాదు. 11 ఏళ్ల క్రితమే ఝాన్సీ బుల్లితెర మీద మెరిసింది. అయితే అప్పుడు ఆమె ప్రతిఫలం సరిగా గుర్తించకపోవడంతో సరైన అవకాశాలు అందుకోలేకపోయింది. 11 ఏళ్ల క్రితం జీ తెలుగులో ప్రసారమైన తీన్మార్ అనే డాన్స్ కార్యక్రమంలో సందడి చేసింది. ఆ డాన్స్ కార్యక్రమానికి కూడా ఇంద్రజ జడ్జ్ గా వ్యవహరించగా ఉదయభాను యాంకర్ గా వ్యవహరించింది. తీన్మార్ డాన్స్ షోలో పాల్గొన్న కండక్టర్ ఝాన్సీని ఉదయభాను గాజువాక ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీ అంటూ స్టేజి మీదకి పిలిచిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే 11 ఏళ్ల క్రితం సోషల్ మీడియా అంతగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆమె పాపులర్ అవ్వలేదు. జీ తెలుగు లో కనిపించిన కూడా సరైన అవకాశాలు అందక ఆమె రికార్డు డ్యాన్సులు చేస్తూ కాలం గడిపింది. అయితే మల్లెమాల పుణ్యమా అంటూ ఒకే ఒక్క పాటతో ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిపోయింది. ప్రస్తుతం ఝాన్సీ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో ఐటమ్ సాంగ్ కి సెలెక్ట్ అయ్యింది. అంతేకాకుండా ఇప్పుడు ఆమె ఆదాయం కూడా రెట్టింపు అయింది. గతంలో తీన్మార్ డాన్స్ కార్యక్రమానికి సంబంధించిన ఝాన్సీ డాన్స్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.