కండక్టర్ ఝాన్సీ కి పోటీగా రంగంలోకి దిగిన నెల్లూరు కవిత.. గట్టి పోటీనే?

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ ద్వారా మల్లెమాలవారు ఎంతోమంది కొత్తవారికి అవకాశాలు కల్పించి వారిలో ఉన్న టాలెంట్ నిరూపించుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ఇలాగే ఇటీవల కండక్టర్ ఝాన్సీ నీ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదకు తీసుకువచ్చి ఆమెలో ఉన్న టాలెంట్ ని ప్రజలకు తెలిసేలా చేసిన మల్లెమాల… తాజాగా మరొక అద్భుతమైన డాన్సర్ ని శ్రీదేవి డ్రామా కంపెనీ షో వేదికగా పరిచయం చేశారు. పల్సర్ బైక్ పాటకి అద్భుతమైన మాస్ స్టెప్పులు వేసి ఓవర్ నైట్ లో సెలబ్రిటీగా మారిపోయిన కండక్టర్ ఝాన్సీ ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్ గా కొనసాగుతోంది.

ఇక ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో మల్లెమాలవారు మరొక కొత్త డాన్సర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. నెల్లూరు కి చెందిన కవిత అనే యువతికి శ్రీదేవి డ్రామా కంపెనీ సోలో పాల్గొనే అవకాశం కల్పించి కండక్టర్ ఝాన్సీ కి పోటీగా నిలబెట్టారు. ఇక ఈ ఎపిసోడ్ లో ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు డాన్స్ చేస్తూ పోటీ పడనున్నారు.

ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ ప్రోమోలో నెల్లూరు కవిత మాట్లాడుతూ.. శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా కండక్టర్ ఝాన్సీ ఫేమస్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆమెకు గట్టి పోటీ ఇవ్వటానికి నేను వచ్చాను అంటూ తన టాలెంట్ మీద ఉన్న నమ్మకంతో ఝాన్సీ కి సవాల్ విసిరింది. ఇక ఈ ఎపిసోడ్ లో ఇద్దరు కూడా ఒకే పాటకు డాన్స్ చేస్తూ పోటీ పడ్డారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sridevi Drama Company Promo - Every Sunday @1:00 PM - 16th October 2022 - Hyper Aadi, Indraja,Jhansi