యంగ్ హీరో సినిమాలో మరో అవకాశం అందుకున్న కండక్టర్ ఝాన్సీ.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది వారికి ఉన్న టాలెంట్ ని సోషల్ మీడియా ద్వారా నిరూపించుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారిలో అతి తక్కువ మందికి మాత్రమే సినిమాలలో నటించే అవకాశాలు దక్కుతాయి. ఇలా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన కండక్టర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పల్సర్ బైక్ పాటకు మాస్ స్టెప్పులు వేసిన ఝాన్సీ ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది.

దీంతో ఝాన్సీ బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో అవకాశాలు అందుకోవడమే కాకుండా సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన డాన్స్ వీడియోలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల సంపూర్ణేష్ బాబు తన సినిమాలో ఐటమ్ సాంగ్ కి ఝాన్సీ కి ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి.

ఇక తాజాగా ఝాన్సీ గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో ఫుల్ లెంత్ రోల్ లో నటించే అవకాశాన్ని ఝాన్సీ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఝాన్సీ దాదాపు 40 రోజుల పాటు డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం నిర్మాతలు రూ. 20 లక్షల రెమ్యూనరేషన్ తో పాటు మరో రూ. 5 లక్షలు అదనపు ఖర్చులకోసం చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా ద్వారా ఝాన్సీ దాదాపు పాతిక లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.