జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లడానికి అదే కారణం.. అసలు విషయం చెప్పిన కమెడియన్ సత్య శ్రీ!

జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభంలో ఈ కార్యక్రమంలో అందరూ కూడా మగవారు మాత్రమే పాల్గొని పెద్ద ఎత్తున తమ కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను సందడి చేసేవారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో కొన్నిసార్లు లేడి గెటప్స్ కూడా మగవారే వేసి పెద్ద ఎత్తున కామెడీ పండిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. అయితే రాను రాను ఈ కార్యక్రమంలో లేడీ కమెడియన్స్ కూడా పాల్గొంటున్నారు. ఈ విధంగా ఎంతోమంది టీవీ సెలబ్రెటీలు సైతం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ విధంగా లేడీ గెటప్స్ ద్వారా జబర్దస్త్ కార్యక్రమంలో ముందుగా పరిచయమైన వారిలో కమెడియన్ సత్య శ్రీ ఒకరు.ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు బుల్లితెర సీరియల్స్ లోను అలాగే సినిమాలలో పలు పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేవారు. ఇలా ఎన్నో సినిమాలు సీరియల్స్ లో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే చమ్మక్ చంద్ర తనని జబర్దస్త్ కార్యక్రమానికి పరిచయం చేశారు.చమ్మక్ చంద్ర స్కిట్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సత్య శ్రీ చమక్ చంద్రతో పాటు జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి బయటకు వెళ్లారు.

ఈ విధంగా ఈమె జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.ఈ క్రమంలోనే సత్య శ్రీ మాట్లాడుతూ తనని జబర్దస్త్ కార్యక్రమానికి పరిచయం చేసింది చమ్మక్ చంద్ర. ఆయన వల్ల తనకు ఎంతో మంచి గుర్తింపు వచ్చిందని అందుకే చమ్మక్ చంద్రను తాను ఎప్పుడు తన గురువుగా భావిస్తానని సత్యశ్రీ వెల్లడించారు.ఇకపోతే కొన్ని కారణాల వల్ల చమ్మక్ చంద్ర జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోవడంతో తమ గురువు ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడే ఉంటామని మా టీమ్ మొత్తం జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చేసామని ఈ సందర్భంగా సత్య శ్రీ పేర్కొన్నారు.