నవదీప్ పరువు పాయే.. సద్దాం మామూలోడు కాదు!!

నవదీప్ పరువు పాయే.. సద్దాం మామూలోడు కాదు!!

అదిరింది షోలో నవదీప్ ఉన్న సమయంలో సద్దాం ఎంత దారుణంగా సెటైర్లు వేసేవాడో అందరికీతెలిసిందే. ప్రతీసారి నవదీప్‌ను ఇరికించే ప్రయత్నం చేసేవారు. నవదీప్ మీద అదో రకమైన ఇమేజ్ ఏర్పడటంలో అదిరింది టీం, అందులోనూ సద్దాం హస్తం ఎక్కువే ఉంది. ఈ మధ్య బొమ్మ అదిరింది షో రావడం లేదు. కానీ ప్రత్యేక ఈవెంట్లు మాత్రం రచ్చ చేస్తున్నాయి. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అంటూ పార్టీకీ వేళాయెరా అనే ఓ ఈవెంట్ చేశారు.

నవదీప్ పరువు పాయే.. సద్దాం మామూలోడు కాదు!!
నవదీప్ పరువు పాయే.. సద్దాం మామూలోడు కాదు!!

అందులో సద్దాం ఓ ఆట ఆడుకున్నాడు. అందరిలా ఇమిటేట్ నవ్వించేశాడు. బాలయ్య, రాజశేఖర్‌లా మిమిక్రీ చేసి కడుపుబ్బా నవ్వించేశాడు. ఇక తాజాగా సంక్రాంతి ఈవెంట్‌కు మరో లెవెల్‌లో ఫన్ ఇచ్చేందుకు వచ్చాడు. సంక్రాంతి సంబురాలు అంటూ జీ తెలుగులో రాబోతోన్న ఈవెంట్‌లో సద్దాం నవదీప్‌ను రోస్ట్ చేసి పడేశాడు. చీఫ్ గెస్ట్‌గా వచ్చిన నవదీప్‌ను చీప్ గెస్ట్‌గా చేసేశాడు. వరుసగా పంచ్‌లు వేసి పరువుదీశాడు.

నవదీప్ వేసుకున్న క్యాస్టూమ్స్‌పైన కౌంటర్ వేశాడు. ట్రైలర్ వాడికి మొత్తం బట్ట ఇవ్వాలి.. సగం సగం ఇస్తే ఇలానే కుట్టేస్తాడంటూ కౌంటర్ వేశాడు. మా ఊర్లో బర్రెకు ఉండాల్సిన గంటలు ఎక్కడికో పోయాయ్ అని అనుకున్నాను.. నీ మెడలోకి వచ్చాయా? అని నవదీప్ మెడలో ఉన్న లాకెట్ పైనా కౌంటర్ వేశాడు. మొత్తానికి నవదీప్‌ను సద్దాం ఓ రేంజ్‌లో రోస్ట్ చేసి పడేశాడు. మొత్తానికి ఈ ప్రోమో మాత్రం బాగానే క్లిక్ అయింది.