బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్

దేశవ్యాప్తంగా ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఎరియాలటీ షో ఇప్పుడు ఆరవ వారం నడుస్తోంది. అయితే బిగ్ బాస్ ప్రతి సీజన్ లో కూడా ఒకటి రెండు ప్రేమ జంటలు కనిపిస్తుంటాయి. అయితే వారందరూ బిగ్ బాస్ యాజమాన్యం వారి సూచన మేరకు షో కోసం మాత్రమే అలా చేస్తుంటారని..ఈ షో మొత్తం స్క్రిప్టెడ్ అంటూ చాలా కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ ఈ విషయం గురించి పొరపాటున నోరు జారింది.

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండు వారాల పూర్తి చేసుకుని మూడవ వారం కొనసాగుతోంది. ఇక ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా ప్రేమ జంటలు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ షో లో అడుగుపెట్టినప్పటి నుండి అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్య మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తొంది. ఆమె ఏం చేసినా కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. అంతే కాకుండా మొదటి వారంలో శ్రీ సత్య కి ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని ప్రశ్న వేయగానే.. అర్జున్ మెరుపు వేగంతో వచ్చి బాజర్ నొక్కాడు. దీంతో అక్కడున్న వారితో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.

ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో నేహా చౌదరి ‘అసలు శ్రీ సత్య, అర్జున్ మధ్య ఏముంది’ అని శ్రీహాన్‌ను ప్రశ్నించగా..వాడికి ఆ అమ్మాయి మీద ఏదో ఫీలింగ్ ఉంది.. కానీ ఆ ఫీలింగ్ బయటపెట్టడం లేదు .అంతే కాకుండా బ్రదర్ అని పిలవనా అని సత్య అడిగితే ఏమీ మాట్లాడడం లేదు అని చెప్పుకొచ్చాడు. దీంతో నేహా కల్పించుకొని.. వాసంతి తో కూడా అర్జున్ అలాగే ఉంటున్నాడు. ఇది ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నా? ఒక్కో సారి వీరు కేవలం షో కోసం మాత్రమే చేస్తున్నారేమో అనిపిస్తోంది’ అని నోరు జారింది. ఇలా చాలా కాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాటలలో నిజం ఉందని నేహా అన్న మాటలతో అర్థం అయ్యింది.