మూడవ వారంలో నేహా చౌదరి ఔట్.. అతని మోసం వల్లే అంటూ ఎమోషనల్..?

ఇటీవల ప్రారంభమైన బిగ్ సీజన్ 6 నిన్నటితో మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక నిన్న ఆదివారం కావటంతో సండే పండే అంటూ నాగార్జున కంటెస్టెంట్ల చేత ఫన్నీ టాస్కులు ఆడించాడు. ఇక ఈవారంలో నామినేషన్స్ లో ఉన్న 9 మంది కంటెస్టెంట్ల నుండి ఒకరిని ఎలిమినేట్ చేశాడు. ఈ తొమ్మిది మంది కంటెస్టెంట్లలో చివరికి నేహా చౌదరి , వాసంతి నామినేషన్లు ఉండగా బిగ్ బాస్ నేహా చౌదరిని ఎలిమినేట్ చేశాడు. ఇక నేహా ఎలిమినేట్ అవటంతో నమ్మినవాళ్లే తనని మోసం చేశారంటూ నేహా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది.

ఇక నేహా బయటికి వచ్చిన తర్వాత నాగార్జున ఆమెకు ఒక టాస్క్ ఇచ్చాడు. ఇక ఈ టాస్క్ లో భాగంగా ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెంట్ లలో దమ్మున్న కంటెస్టెంట్లుగా ఐదు మందిని దుమ్ము కంటెస్టెంట్లుగా ఐదు మందిని సెలెక్ట్ చేయమన్నారు . వీరిలో దుమ్ము కంటెస్టెంట్లుగా స్నేహ 6 మందిని సెలెక్ట్ చేసింది. ఇక వారి గురించి ఒక్కో మాట చెబుతున్న క్రమంలో రేవంత్ గురించి చెబుతూ రేవంత్ వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటూ తాను రేవంత్ ను నమ్మి మోసపోయినట్లు వెల్లడించింది.

ఇక దమ్మున్న కంటెస్టెంట్లుగా చంటి, శ్రీ సత్య ,రాజశేఖర్ సుదీప, శ్రీహాన్, బాలాదిత్య, ఆదిరెడ్డి ఫోటోలను పెట్టింది. వీరిలో ఒక్కొక్కరి గురించి చెబుతూ నేహా చాలా ఎమోషనల్ అయింది. మరి ముఖ్యంగా రాజశేఖర్ గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయింది. ఈ క్రమంలో రాజశేఖర్ గురించి మొదటినుండి రాజశేఖర్ తో తనకు మంచి బాండింగ్ ఉందని బిగ్ బాస్ ద్వారా తనకు రాజ్ లాంటి మంచి ఫ్రెండ్ దొరికాడని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా నేనే నీ బాడీ గార్డ్ అంటూ రాజ్ తో ఉన్న ఎమోషనల్ బాండింగ్ గురించి నేహా వివరించింది.