దీపను చంపడానికి ప్లాన్ చేసిన చారుశీల…. శౌర్య కోసం పరుగులు తీసిన దీప!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు సరికొత్త ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరగనుందనే విషయానికి వస్తే…శౌర్య తన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఒకవేళ అమ్మానాన్నలు బ్రతికే ఉంటే వాళ్లు హైదరాబాద్ వెళ్లి నానమ్మ వాళ్లతో కలిసి ఉండాలి. ఇక్కడే ఎందుకు ఉన్నారు నిజంగానే వాళ్ళు బతికున్నారా అని సందేహపడుతుంది.ఇక ఆ స్లిప్ చూసి ఈ చేతిరాత తప్పనిసరిగా నాన్నది అంటే నాన్న బ్రతికే ఉన్నారు అని అనుకుంటుంది. అంతలోపే చంద్రమ్మ అక్కడికి రావడంతో పిన్ని నిజంగానే మా అమ్మ నాన్నలు బ్రతికున్నారా అని అడగడంతో బ్రతికున్న వారిని లేరని చెప్పడం మహా పాపం వాళ్లు ఉన్నారు ఏదో ఒక రోజు నీ దగ్గరకు వస్తారని చంద్రమ్మ సౌర్యతో చెబుతుంది.

అంతలోగా ఇంద్రుడు అక్కడికి రావడంతో బాబాయ్ వెళ్దామా అంటే ఎక్కడికి అంటాడు హాస్పిటల్ కి వెళ్లి టెస్టులు చేయించుకోవాలి కదా అని సౌర్య అనడంతో రేపు వెళ్దాం బంగారు అనడంతో లేదు ఇప్పుడే వెళ్లాలి అంటూ తనని తొందర పెడుతుంది. అలాగే చంద్రమ్మకు ఒక గ్లాస్ బియ్యం ఎక్కువ చేసి పెట్టు అక్కడ మా నాన్న ఉంటాడు తప్పనిసరిగా తీసుకు వస్తానని వెళతారు. మరోవైపు సౌందర్య శౌర్య దగ్గరకు వెళ్లడానికి ప్రయాణం చేస్తూ ఎక్కడో తిరగాల్సిన నేను ఇలాంటి పల్లెటూర్లో తిరుగుతున్నాను అంటే తప్పకుండా నాకు ఆ దేవుడు సహాయం చేస్తాడని అనుకుంటున్నాను అని భావిస్తుంది.

ఇక చారుశీల తనలో తాను మాట్లాడుకుంటూ దీపకు గుండె బాగా లేదని అబద్ధం చెప్పి తనను కృంగదీసి చంపుదామని అనుకుంటే ఆ అవకాశం లేకుండా కార్తీక్ తనకు బాగలేదని అబద్ధం చెప్పాడు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నాకు వేరే మార్గం లేదు ఆ దీపను చంపేయడమే నా లక్ష్యం అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి పండరి వస్తుంది. రా పండరి నీ కోసమే ఎదురుచూస్తున్నాను దీపా ఎలా ఉంది అని అడగడంతో భర్తకు బాగలేదని తెలిసిన భార్య ఎలాగుంటుంది బాధపడుతూనే ఉంది దీపమ్మ అని చెప్పడంతోసరే పండరి దీప ఆరోగ్యం బాగాలేదు కదా తనకు తెలియకుండా ఈ మాత్రలు తనకు వేస్తూ ఉండు చివరికి కార్తీక్ కి కూడా ఈ విషయం తెలియకూడదు అని మాత్రలు ఇస్తుంది.

దీపమ్మ క్షేమంగా ఉంటుందని తెలిస్తే ఎవరికీ తెలియకుండా ఈ టాబ్లెట్ తనకు ఇస్తానని చెప్పి తీసుకెళ్తుంది. దాంతో తనకు ఆరోగ్యం బాగయ్యేది కాదు. ఈ మాత్రలు వాడితే తన గుండె ఆగిపోతుంని మనసులో అనుకుంటుంది.మరోవైపు సౌందర్యవాళ్ళు సౌర దగ్గరికి రావడంతో శౌర్య తనని తీసుకెళ్లిపోతారేమోనని మరోసారి గొడవ చేస్తుంది.దీంతో సౌందర్య కోపం తెచ్చుకొని కాస్త నేను చెప్పేది విను మేము కూడా ఇక్కడే ఉంటున్నామని చెప్పడంతో ఇక్కడే ఉంటున్నారు కదా అని అవకాశం వచ్చిన ప్రతిసారి హిమా నువ్వు నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తే అసలు ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. ఇక సౌందర్య వాళ్లు దీప డాక్టర్ అన్నయ్య ఇంటిదగ్గర ఇల్లు అద్దెకు తీసుకుంటారు.

మరోవైపు పండరి కాఫీలో ఆ టాబ్లెట్ కలిపి దీపక్ ఇవ్వగా దీప కాఫీ ఏంటి ఇలా ఉంది అని అడగడంతో పండరి కాఫీ పౌడర్ మార్చానని చెబుతుంది. ఇక దీప కార్తీక్ తో మాట్లాడుతు… శౌర్య వాళ్లు మనల్ని చూడకూడదు కానీ మనం వాళ్ళని చూడొచ్చు కదా డాక్టర్ బాబు నన్ను తీసుకెళ్లి దూరం నుంచి తన బిడ్డను చూపించమని అడగడంతో పగలైతే శౌర్య కనుక్కుంటుంది రాత్రికి నేను తప్పనిసరిగా తీసుకెళ్తానని కార్తీక్ మాట ఇస్తాడు. తర్వాతి ఎపిసోడ్ లో చూసిన దీపా ఆగలేక తనకోసం పరుగులు తీస్తుంది.