ఫైమా కోసం జబర్థస్త్ టీమ్ తో కలసి భారీగా స్కెచ్ వేసిన చంటి…?

ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 లో జబర్దస్త్ నుండి ఇద్దరు కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేశారు. జబర్దస్త్ ద్వారా కమెడియన్లుగా గుర్తింపు పొందిన చంటి , ఫైమ సీజన్ 6 లో పార్టిసిపేట్ చేసి తమదైన శైలిలో గేమ్ ఆడుతున్నారు. అయితే గతవారం చలాకి చంటి హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. ఇక ఫైమా మాత్రం హౌస్ మెట్స్ కి గట్టి పోటీ ఇస్తు టాప్ 5 దిశగా కొనసాగుతోంది.

ఇక ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన చంటి బయటికి వచ్చిన తర్వాత హౌస్ లో ఉన్న ఫైమా కోసం భారీ స్కెచ్ వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో అద్భుతంగా పర్ఫార్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్న పైమా తన కామెడీతో హౌస్ మేట్స్ ని కూడా అలరిస్తోంది. ఫైమా ఆట తీరు చూసి ఆమె పక్కా టాప్ 5 లో ఉంటుందని ఆమె అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే ఆల్రెడీ టాప్ లో ఉన్న వారిని దాటుకుని ఫైమా టైటిల్ దక్కించుకోవటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.

అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన చంటి ఫైమా కోసం జబర్దస్త్ కంటెస్టెంట్లతో కలిసి భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తొంది. ఎలాగైనా ఫైమా ని టైటిల్ విన్నర్ గా చూడాలని చంటి కష్టపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఫైమా కూడా హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో కూడా కష్టపడాల్సి ఉంటుంది. ఫైమా కోసం చంటి పడుతున్న కష్టం ఫలిస్తుందో? లేదో? చూడాలి మరి.