Peta Rowdy: హీరో చంటి పుట్టినరోజు సందర్భంగా ‘పేట రౌడీ’ బర్త్‌డే పోస్టర్ లాంచ్

Peta Rowdy: వీకే క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్–2గా తెరకెక్కుతున్న చిత్రం ‘పేట రౌడీ’. ఇటీవల ఈ చిత్రాన్ని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. మాక్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కళ్యాణి కర్తనాధ నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మాస్ లవ్ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

హీరో చంటి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ బర్త్‌డే పోస్టర్‌ను ఆనంద్ గ్రూప్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఎల్. ఆనంద్ కుమార్ చేతుల మీదగా ఆవిష్కరించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తయ్యిందని, త్వరలోనే మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఈ చిత్రానికి అదనపు స్క్రీన్‌ప్లే కేవీర్ అందించగా, మాటలు–పాటలు భాష్యశ్రీ రాశారు. సినిమాటోగ్రఫీని వై.ఎస్. కృష్ణ నిర్వహిస్తున్నారు. లైన్ ప్రొడ్యూసర్లుగా ఇటీకర్లపల్లి మహేష్ కుమార్, దంతులూరి పృథ్విరాజ్ వ్యవహరిస్తున్నారు. ఫైట్ మాస్టర్‌గా : జాషువ, ఎడిటర్ : శివ శర్వాణి పీఆర్‌ఓగా గణేష్ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.

మంత్రుల టెన్షన్ || Chillagattu Sreekanth About Chandrabanu Plans To Change Cabinet Ministers || TR