బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేడు ఎంతో ఆసక్తికరంగా మారింది. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే… చక్రపాణి జగతితో మాట్లాడుతూ తనని అవమాన పరుస్తాడు.రిషి నీ కన్నా కొడుకు అని తెలిస్తే నేను ఈ పెళ్లి అస్సలు చేయను ఒప్పుకోను అంటూ ఫోన్ కట్ చేస్తాడు. వసుధార జగతి మేడంతో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటూ తన తండ్రి పై అరుస్తుంది. దీంతో చక్రపాణి వసుధార ఫోన్ లాక్కొని తనని ఒక గదిలో బంధిస్తాడు. అలాగే ఒక బాటిల్లో విషం కలిపి నువ్వు కనుక తీస్తే నేను విషం తాగి చచ్చిపోతానని సుమిత్రను బెదిరిస్తాడు.
మరోవైపు జగతి జరిగినది మొత్తం మహేంద్రకు చెబుతుంది. ఈ విషయం వెంటనే రిషికి చెబుదామని మహేంద్ర అనడంతో వద్దు మహేంద్ర ఇది రిషికి తెలిస్తే ఏదైనా ఒక అనరాన్ని మాట అంటే వారి బంధానికే ఇబ్బంది ఏర్పడుతుంది మనం రిషి కంటే ముందుగా అక్కడికి వెళ్లాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు.ఇది విన్నటువంటి దేవయాని ఓహో మీరు ఇలా ప్లాన్ చేస్తున్నారా అని పక్కకు వెళ్లి రాజీవ్ కి ఫోన్ చేసి జరిగినది మొత్తం చెబుతుంది. ఇక జగతి మహేంద్ర బయలుదేరుతూ ఉండగా దేవయాని ఎక్కడికి బయలుదేరారు అని అడగడంతో చీరలు అవి కొనాలి కదా తీసుకువస్తామని అబద్ధం చెప్పి బయలుదేరుతారు.
మరోవైపు చక్రపాణి తన బావ రాజీవ్ తో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు.అవన్నీ చూసిన వసుధార షాక్ అవుతుంది నా పెళ్లి నా ఇష్టం ముందు మీరు తలుపు తీయండి అని అరుస్తున్నప్పటికీ చక్రపాణి మాత్రం సుమిత్రను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు.అమ్మ నీకు కూడా బాధ్యత లేదా ముందు తలుపు తీ నాన్న ఏం చేసుకోడు ఊరికనే బెదిరిస్తున్నాడు అని వసుధార చెప్పినప్పటికీ సుమిత్ర మాత్రం ఏం మాట్లాడకుండా కుమిలిపోతూ ఉంటుంది.
మరోవైపు రాజీవ్ తన మావయ్యని బుట్టలో వేసుకోవడం కోసం మంచివాడిగా నటిస్తూ ఉంటాడు. అయితే రిషి మాత్రం వసుధారకు ఫోన్ చేయగా అమ్మ కనీసం ఫోన్ అయినా ఇవ్వు అనడంతో సుమిత్ర ఫోన్ కూడా ఇవ్వదు కానీ ఫోన్ ఆన్ చేసి స్పీకర్ పెట్టడంతో రిషి ఏంటి వసుధారా మీ బావ ఇక్కడికి వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు అసలు అక్కడ ఏం జరుగుతుంది నేను ఇప్పుడే అక్కడికి వస్తానని ఫోన్ కట్ చేసి వసుధార కోసం తన ఇంటికి బయలుదేరుతాడు. మరోవైపు రాజీవ్ పంతులను పిలుచుకొచ్చి వెంటనే పెళ్లి చేయమని చెప్పడంతో ఇక్కడ ఎవరూ లేరు కదా పెళ్లి ఎలా జరిపించాలి అనడంతో కొన్ని కారణాలవల్ల ఎవరు లేకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ముందు మాకు పెళ్లి జరిపించండి అని చెబుతారు ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.