బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. రిషి విరామం కావాలి ఇంటి నుంచి ఎవరికి తెలియని ప్రదేశానికి వెళ్ళిపోతున్నాను మరి ఎప్పుడు వస్తానో నాకు తెలియదు అని చెబుతుంటాడు. ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పే ప్రయత్నం చేసిన తను ఎవరి మాట వినడు జగతి మాత్రం నువ్వు వెళ్లదు అని చెప్పే అర్హత నాకు లేదు కానీ నువ్వు వెళుతున్నట్టు కాలేజీకి వచ్చే అందరికీ చెప్పి వెళ్ళు లేదంటే నువ్వు ఎందుకు వెళ్ళావో ఏంటో అని అపార్థాలు చేసుకుంటారు. ఇది నీ ప్రతిష్టకే కాకుండా కాలేజీ ప్రతిష్టకు కూడా భంగం కలిగినట్టు అవుతుంది రిషి అని చెప్పడంతో వెంటనే పనింద్ర జగతి చెప్పినది మంచి ఆలోచన నువ్వు కాలేజీకి వచ్చి అందరికీ చెప్పి వెళ్ళిపో అని చెబుతారు.
ఇక కాలేజీకి వెళ్లిన రిషి ఎప్పుడు వసుధారతో కలిసి ఈ కాలేజీలో దిగేవాడిని ఇప్పుడు తన జ్ఞాపకాలతో దిగుతున్నాను అంటూ బాధపడతాడు రిషిని చూసిన జగతి కూడా వసుధారతో కలిసి దిగే నువ్వు ఇప్పుడు తన జ్ఞాపకాలతో బాధతో కాలేజీలోకి అడుగు పెట్టావు అని బాధపడుతుంది. ఇక రిషి వసుధార జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉండగా మహేంద్ర ఫోన్ చేసి నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు రా నాన్న అని పిలుస్తారు.ఇక మీటింగ్ ఆరెంజ్ చేయడంతో రిషి అక్కడికి వెళ్లి కొన్ని కారణాలవల్ల నేను కాస్త బ్రేక్ తీసుకుంటున్నాను అందుకే నా ఎండి పదవిని జగతి మేడం తీసుకుంటున్నారు ఎందుకు ఏంటి అని ప్రశ్నలు వద్దు. కాలేజిని ఇదివరకు ఎలా ముందుకు నడిపించారో ఇకపై కూడా అలాగే నడిపించండి అని చెబుతాడు.
ఇక ఈ విషయాన్ని నోటీస్ బోర్డులో కూడా అతికించండి అని చెప్పిన రిషి జగతి చేతులు పట్టుకొని తనని తీసుకువచ్చి తన సీట్ల కూర్చోబెడతాడు. మేడం డాడ్ జాగ్రత్త అలాగే కాలేజ్ కూడా అని చెప్పడంతో జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. స్టాఫ్ మొత్తం వెళ్లిపోవడంతో తను లగేజ్ తనతో పాటు తెచ్చుకున్నానని, ఇటు నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లిపోతానని చెప్పడంతో అందరూ బాధపడతారు.ఇక రిషి కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోతుండగా వసుధార కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చి రిషి సార్ అంటూ గట్టిగా అరుస్తుంది. అయితే రిషి అది భ్రమ అనుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కారు ఆపిన వసుధార అన్న మాటలు గుర్తుకు వచ్చి తన కోపంగా వెళ్ళిపోతాడు.
ఇక రిషి సీట్లో జగతికోవడానికి ఇబ్బంది పడుతూ ఉండగా మహేంద్ర తనని ఆ సీట్ లో కూర్చోబెడతాడు. అదే సమయంలో వసుధర అక్కడికి వెళ్లడంతో మహేంద్ర, జగతి షాక్ అవుతారు. ఇక జగతి వసుధార మెడలో తాళిని చూసి ఎందుకు వచ్చావు అని అడగడంతో అదేంటి మేడం నేను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ వెంటనే ఆ పనులు చేయాలంటూ మినిస్టర్ గారి దగ్గర నుంచి మెయిల్ వచ్చింది అందుకే వచ్చాను అని చెబుతుంది.దాంతో మహేంద్ర ఇప్పుడు కాలేజ్ ఎండి జగతి మేడం అని చెప్పడంతో రిషి సార్ ఎక్కడికి వెళ్లిపోయారు అని వసుదార అడుగుతుంది. ఎవరికి కనిపించినంత దూరం వెళ్లిపోయాడు అంటూ జగతి చెప్పడంతో వసుధార షాక్ అవుతుంది.