పాపం.. జశ్వంత్: మరీ బుడ్డోన్ని చేసేస్తిరే.!

బిగ్‌బాస్ హ‌స్‌లో కెప్టెన్సీ అధికారం చేజిక్కించుకోవాలని కంటెస్టెంట్స్ అంతా కుతూహలపడతారు. అందుకోసం జరిగే టాస్క్‌లు కూడా అంతే కఠినంగా ఉంటాయి. అయితే, గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ కాస్త సిల్లీగా జరగడంతో బుడ్డోడు జశ్వంత్ అనూహ్యంగా కెప్టెన్ అయిపోయాడు.

కెప్టెన్ అయితే అయ్యాడు కానీ, ఆ స్థాయి గౌరవం హౌస్‌లో జెస్సీకి ఏ మాత్రం దక్కలేదు. కెప్టెన్ అంటే హౌస్‌లో చాలా రకాల రెస్పాన్సిబులిటీస్ ఉంటాయి. ఖచ్చితంగా హౌస్‌లో ఏం జరిగినా అందుకు కెప్టెన్ బాధ్యత వహించాల్సిందే.

జెస్సీ బాధ్యతలయితే తీసుకున్నాడు కానీ, కంటెస్టెంట్స్‌ని తన కెప్టెన్సీతో ప్రభావితం చేయలేకపోయాడు. జెస్సీ మాటను హౌస్ మేట్స్ అంతా లైట్ తీసుకున్నారు. దాంతో ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, హౌస్ రూల్స్‌ని ఉల్లంఘించాడన్న నెపంతో పాపం జశ్వంత్‌ని గడువు ముగియకుండానే కెప్టెన్సీ పదవి నుండి తొలిగించేశాడు బిగ్‌బాస్.

హౌస్‌లో కొందరు చేసిన తప్పుల వల్ల కెప్టెన్‌గా జెస్సీ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ తర్వాత రియలైజ్ అయిన హౌస్ మేట్స్, ఎవరికి తోచినట్లు వాళ్లు కెప్టెన్ మాట వినాల్సిందే.. అంటూ నీతులు చెప్పడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే, కెప్టెన్సీ అంటే అంత ఆషా మాషీ కాదు. అందుకు సరైన అర్హత ఉన్న వ్యక్తులకే ఆ అధికారం దక్కాలి.. అందుకే ప్రియ, యానీ మాస్టర్ వంటి సీనియర్లను తాను సపోర్ట్ చేశానంటూ, జెస్సీ కెప్టెన్సీ సమయంలో తన వ్యతిరేకతకు క్లారిటీ ఇచ్చుకున్నాడు నటరాజ్ మాస్టర్.