సుధీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన బుల్లెట్ భాస్కర్.. వైరల్ అవుతున్న వీడియో?

బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందిన సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుధీర్ సినీ జీవితం అందరికీ ఒక తెరిచిన పుస్తకంలో ఉంటుంది. మెజీషియన్ గా తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా అవకాశం పొన్నాడు. ఆ తర్వాత తన ప్రతిభతో టీం లీడర్ గా మారి మంచి గుర్తింపు పొందాడు. సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురు కలిస్తే చాలు పంచ్ ల వర్షం కురిపిస్తారు. కానీ ఎప్పుడూ సుధీర్ ని ఒక్కడిని చేసి అందరూ ఆడుకుంటారు. ఇలా జబర్థస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన సుధీర్ సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకున్నాడు.

ఈ క్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా నటించాడు. ఇప్పటివరకు సుధీర్ హీరోగా నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేకపోయాయి. కానీ బుల్లితెర మీద వరుస షో లు చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు. అయితే జబర్థస్త్ ద్వారా గుర్తింపు పొందిన సుధీర్ ఇటీవల జబర్థస్త్ కి దూరమయ్యాడు. అంతే కాకుండా శ్రీదేవీ డ్రామా కంపెనీ లో యాంకర్ చాన్స్ కూడా వదులుకొని మా టీవిలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ షో లో అనసూయతో కలసి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. అయినప్పటికీ జబర్థస్త్ లో మాత్రం సుధీర్ మీద పంచులు , సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే ఆది , రాంప్రసాద్ కూడా ఇన్ డైరెక్ట్ గా బాబూ బాబూ అంటూ రష్మి ని ఏడిపిస్తూ ఉంటారు.

ఇటీవల ఒక స్కిట్ లో బుల్లెట్ భాస్కర్ కూడా సుధీర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక స్కిట్ లో బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ అందరూ కలిసి ఒకరిని ఎంకరేజ్ చేశారు. వాడేమో సొరంగంలో నుంచి దూరి పక్క రాజ్యానికి పారిపోయాడు అంటూ చెప్పాడు. దీంతో బుల్లెట్ భాస్కర్ ఇన్ డైరెక్ట్ గా సుధీర్ మీద సంచలన కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే జబర్దస్త్ లో రాంప్రసాద్ గెటప్ శ్రీను అందరూ కలిసి సుధీర్ ని బాగా ఎంకరేజ్ చేశారు. సుధీర్ బాగా ఫేమస్ అయిన తర్వాత జబర్దస్త్ వదిలి అధిక రెమ్యునరేషన్ కి ఆశపడి పక్క ఛానల్ అయిన మాటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోలో యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. బుల్లెట్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.