బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్ధం కాదు. కొంత గెస్ చేసినా, మరికొంత గెస్ చేయలేనంతగా ఈక్వేషన్స్ మారిపోతుంటాయ్. ఈ సీజన్ బిగ్ బాస్‌లో ఓ జంటకు ఎలాగైనా పెళ్లి చేసేస్తారట.. అందుకు తగ్గట్లుగా ప్లాట్ ఫామ్ సెట్ చేస్తున్నారట.. అంటూ షో మొదలవ్వక ముందే గట్టిగా ప్రచారం జరిగింది.
అయితే, షో మొదలయ్యాకా ఆ వైబ్స్ ఎక్కడా కనిపించలేదు. మెల్ల మెల్లగా శ్రీరామ్ చంద్ర, హమీదా మధ్య నడిపించిన లవ్ ట్రాక్‌తో ఆ ప్రచారానికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఆ ప్రచారంలోని జంట వీళ్లేనేమో అనుకున్నారు. కానీ, అనుకోకుండా హమీదా ఎలిమినేషన్ జరిగింది.
ఇక ఇప్పుడు మానస్, ప్రియాంక సింగ్ మధ్య ఏదో జరుగుతోంది.. అన్నట్లుగా కొత్త ట్రాక్ క్రియేట్ చేశారు. హౌస్‌లో ఉన్న మేల్ కంటెస్టెంట్స్ అందర్నీ అన్నయ్యా అని పిలిచే పింకి, మానస్‌తో మాత్రం డిఫరెంట్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తోంది. చిన్న చిన్న అలకలు, చిలకలతో లవ్ ట్రాక్ లాంటిదేదో వీళ్లిద్దరి మధ్యా నడుస్తోందేమో అన్న అనుమానాలు మొదలవుతున్నాయి.
నిప్పు లేనిదే పొగ రాదు కదా.. ఒకవేళ బిగ్ బాస్ హిస్టరీని ఛేంజ్ చేయబోయే జంట ఇదేనా.? వామ్మో.. ష్ గప్‌చుప్.!