పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేహ చౌదరి… వరుడు ఎవరో తెలుసా?

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కంటెస్టెంట్ నేహ చౌదరి. ఈమె స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి రావడంతో స్పోర్ట్స్ యాంకర్ గా వ్యవహరించారు. ఈ విధంగా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నప్పటికీ ఈమెకు సినిమాలపై మక్కువ ఉండటంతో నటన రంగం వైపు కూడా అడుగులు వేసింది.ఈ క్రమంలోనే పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసినటువంటి నేహా చౌదరి బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా సందడి చేశారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లేముందు ఈమె పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసమే బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు.

తనకు ఇంట్లో పెళ్లి చేసుకోమని ఎంతో ప్రెజర్ పెడుతున్నారని అయితే ఆ పెళ్లి గోల నుంచి బయటపడటానికి బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈమె బిగ్ బాస్ కార్యక్రమము నుంచి నాలుగు వారాలకి ఎలిమినేట్ కావడంతో తాను చెప్పిన విధంగానే పెళ్లికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నానని నేహా చౌదరి అధికారికంగా వెల్లడించారు.

ఈ విధంగా ఈమె పెళ్లి చేసుకోబోతున్నానని తెలియడంతో అభిమానులు తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే నేహా చౌదరి తను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మరెవరో కాదని తన ఇంజనీరింగ్ క్లాస్మేట్ అనిల్ అనే వ్యక్తిని తాను పెళ్లి చేసుకోబోతున్నానని ఈ సందర్భంగా నేహా చౌదరి తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.అయితే ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి నెటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు.