అమ్మాయి ప్రేమ కోసం ఆత్మహత్యకి పాల్పడిన బిగ్ బాస్ సూర్య..?

ఇస్మార్ట్ న్యూస్ ద్వారా ఫేమస్ అయిన ఆర్ జె సూర్య బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొని మంచి గుర్తింపు పొందాడు. బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు పొందాడుగా పాల్గొనటమే కాకుండా ఇంటి పనులలో కూడా యాక్టివ్గా ఉండేవాడు. ఇలా టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరిగా ఉంటూ టైటిల్ దక్కించుకోవడానికి గట్టి పోటీ ఇస్తున్న సూర్య అనూహ్యంగా ఎనిమిదవ వారంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. అయితే సూర్య ఇలా ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఆటపరంగా సూర్య ఎంత యాక్టివ్ గా ఉన్నా కూడా అమ్మాయిల విషయంలో మాత్రం చాలా వీక్ గా ఉండేవాడు.

మొదట ఆరోహి రావుతో చనువుగా ఉంటూ పులిహోర కలిపిన సూర్య ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత
ఇనయా తో చనువుగా ఉండటం ప్రారంభించాడు. బయట నాకోసం బుజ్జమ్మ ఎదురుచూస్తుంది అని చెబుతూనే అందరితో పులిహోర కలుపుతూ పులిహోర రాజాగా ఫేమస్ అయ్యాడు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నప్పటికీ అమ్మాయిలందరినీ తన మాటలతో ఆకట్టుకుంటూ వారితో చనువుగా ఉంటున్న సూర్య పులిహోర రాజా అని నెగటివ్ టాక్ తో బయటికి వచ్చాడు. ఇక సూర్య ఎలిమినేట్ అయిన తర్వాత ఇనయ చాలా బాధపడింది.

ఇదిలా ఉండగా .. చదువుకునే రోజుల్లోనే సూర్య ఒక అమ్మాయి ప్రేమ కోసం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. సూర్య ఎంబీఏ జాయిన్ కాగానే ఒక అమ్మాయి ప్రేమలో పడి పెళ్ళంటు చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అయితే సూర్య పేరెంట్స్ అందుకు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడట. ఇలా ఆత్మహత్యకు ప్రయత్నించటంతో సూర్య తల్లిదండ్రులు చేసేదేమీ లేక అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి చదువు పూర్తయ్యే వరకు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోకుండా, కలవకుండా ఉండాలని కండిషన్ పెట్టారట. ఈ క్రమంలో ఎంబీఏ మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్ చేసి సూర్య తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడి వాళ్ళని వదిలిపెట్టి రమ్మని చెప్పటంతో సూర్య కోపంతో ఫోన్ పగలగొట్టి తన తప్పు తెలుసుకున్నాడట.