బిగ్ బాస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. కొద్దిరోజుల్లో విడుదల కానున్నా ప్రోమో…!

బుల్లితెర మీద ప్రసారమైన బిగ్గెస్ట్ రియాలిటీ షో లలో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఎన్నో సంవత్సరాలుగా బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో కి మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇటీవల ఓటిటిలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో కి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 గురించి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ బిగ్ బాస్ సీజన్ 6 లో సెలబ్రిటీలతోపాటు సామాన్యులు పాల్గొనే అవకాశం కూడా కల్పించారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 6 కి సంబందించిన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయినట్టు సమాచారం.

అంతే కాకుండా ఈ సీజన్ 6 కి సంబందించిన సెట్ కూడా దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక అప్పుడప్పుడు ఈ సీజన్ 6 లో పాల్గొనే వారి పేర్లు కూడా బయటికి వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సీజన్ కి సంభందించిన ఫైనల్ లిస్ట్ మాత్రం బయటకి రాలేదు. తాజాగా యాంకర్ ఉదయభాను ఈ బిగ్ బాస్ సీజన్ 6 కి నో చెప్పినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ మాష్టర్ భరత్ కి ఈ షో లో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా బిగ్ బాస్ అభిమానులు ఆనందపడే విషయం ఒక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా ఈ సీజన్ 6 సంభందించిన ప్రోమో కూడా తొందర్లోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ 6 కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సీజన్ కి సమంత హోస్ట్ గా వ్యవహరించనుందని గతంలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ సీజన్ లో నాగార్జున హోస్ట్ అని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇటీవల నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా నిర్మించిన ఒక సెట్ లో బిగ్ బాస్ ప్రోమో షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ బిగ్ బాస్ 6 సంభందించిన ప్రోమోను మరో రెండు వారాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.