దేశవ్యాప్తంగా నెంబర్ వన్ రియారిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రసారం అవుతు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఐదు టెలివిజన్ సీజన్లు ఒక ఓటిటి సీజన్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇటీవల ఆరవ సీజన్ కూడా ప్రారంభం అయింది. ఈ ఆరవ సీజన్ ప్రారంభమై ఇప్పటికే 10 వారాలు పూర్తి అయ్యింది. మునుపటి ఐదు సీజన్లతో పోల్చితే ఈ ఆరవ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. ముఖ్యంగా ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు ఆట మీద ఏకాగ్రత చూపించడం లేదు. అందువల్ల రేటింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి.
ఇక ప్రస్తుతం 11 వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఈ 11వ వారానికి సంబంధించిన నామినేషన్ లో మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అయితే ఈ నామినేషన్స్ నుండి బయటపడటానికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లందరికీ ఒక కాలీ చెక్ ఇచ్చి ఎవరు ఎక్కువ అమౌంట్ రాస్తే వారికి ఇమ్యూనిటీ లభించి నామినేషన్ నుండి సేవ్ అవుతారని చెప్పాడు. అంతేకాకుండా నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లు రాసిన ఎక్కువ అమౌంట్ ని బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కి ఇచ్చే ప్రైస్ మనీ నుండి తగ్గిస్తామని ఇచ్చాడు. అంతేకాకుండా చెక్కుపై రాస్తే నంబర్ గురించి కంటెస్టెంట్లు ఎవరితోనో డిస్కస్ చేయకూడదని ఆ విషయాన్ని లీక్ చేయకూడదని రూల్ పెట్టాడు.
అయితే తాజాగా బిగ్ బాస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం… నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లలో ఎక్కువ అమౌంట్ రాసిన వారిని కాకుండా రాజ్ ని బిగ్ బాస్ సేవ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టైటిల్ విన్నర్ కి ఇచ్చే ప్రైజ్ మనీ నుండి 5 లక్షల రూపాయలు కట్ అయినట్లు కూడా తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ పై ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు. షో రేటింగ్స్ తగ్గాయని టైటిల్ విన్నర్ కి ఇచ్చే ప్రైజ్ మనీ నుండి డబ్బులు కట్ చేసి ఇతర కంటెస్టెంట్లకు ఎలా ఇస్తారు? అంటూ కామెంట్లు చేస్తున్నారు.