AP: జగన్ కంచుకోటను టార్గెట్ చేసిన పవన్….. చంద్రబాబు మాస్టర్ ప్లాన్?

AP: ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అయితే 2019 ఎన్నికలలో 151 స్థానాలలో సింగిల్ గా పోటీ చేసి విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికలలో మాత్రం భారీ ఓటమిని కట్టబెట్టారు. ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే వైసిపి పరిమితం అయింది. ఇకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా వైసిపి ఆనవాళ్లు లేకుండా చేయడమే టార్గెట్ గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పనిచేస్తున్నారు.

ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి కంచుకోటగా ఉన్నటువంటి రాయలసీమపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టిస్తారించారు. ఎలాగైనా ఈ రాయలసీమ జిల్లాలలో తమ పార్టీని మరింత పటిష్టం చేసుకుని జగన్మోహన్ రెడ్డిని భారీగా దెబ్బ కొట్టాలని పక్క పథకాలు కూడా రచిస్తున్నారు.అభివృద్ధి పేరుతో చంద్రబాబు సీమవాసుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమ కూటమికి అడ్డాగా మారబోతుందా.? ఆ నాలుగు జిల్లాల్లో వైసీపీని కోలుకోకుండా చేయడంలో బాబు, పవన్‌ సక్సెస్ అవుతారా అంటే అవునని తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ఎన్నికలలో సీమ జిల్లాలలో కూడా కూటమి పార్టీకి అద్భుతమైన మెజారిటీ సీట్లు వచ్చాయి. అయితే ఇక్కడ ఇదే తరహాలో తమ పార్టీని కొనసాగించాలని ఏమాత్రం పట్టుకోల్పోకుండా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని పథకాలు రచిస్తున్నారు. రాయలసీమలో తిరిగి పట్టు సాధించి నెల్లూరు, ఒంగోలులో చెప్పుకోదగ్గ సీట్లు తెచ్చుకున్నా..కోస్తా జిల్లాల్లో ఏ మాత్రం అనుకూలత పెరిగినా మరోసారి జగన్ సీఎం అవడం గ్యారెంటీ అనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అందుకే వైసీపీని రాయలసీమలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాలని భావిస్తున్నారట డిప్యూటీ సీఎం పవన్. ఇలా సీమ జిల్లాలను టార్గెట్ చేసుకొని ఈయన తరచూ సీమ జిల్లాలలో పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి కడపలో ఈయన ఏకంగా పార్టీ కార్యాలయం కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మరి రాయలసీమలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలనే విషయంలో పవన్ చంద్రబాబు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.