చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. 40 మంది ఎమ్మెల్యేల మైండ్ గేమ్ వెనుక రీజన్లు ఇవేనా?

2019 ఎన్నికల్లో వైసీపీ కనీవిని ఎరుగని మెజారిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఆ పార్టీ చెబుతోంది. అయితే ఇదంతా మైండ్ గేమ్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలు అనుకూలంగా టీడీపీకి ఓటు వేయడంతో కొత్త తరహా ప్రచారం ద్వారా వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ భావిస్తోంది.

ఎన్నికల ఫలితాలు ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోశాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు టీడీపీపై దృష్టి పెట్టడం వాస్తవమే అని అయితే టీడీపీలో చేరినా తమకు పెద్దగా లాభం ఉండదని కొంతమంది ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలలో చాలామందికి జగన్ టికెట్లు ఇవ్వడం లేదని సమాచారం అందుతోంది.

ఈ ఎమ్మెల్యేల వల్ల ఏ పార్టీ నష్టపోతుందో చూడాల్సి ఉంది. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. ప్రజలు మాత్రం ఏ పార్టీ విషయంలో సంతృప్తితో లేరు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్దగా బెనిఫిట్ కలిగే అవకాశం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు 2024 ఎన్నికలే ఒక విధంగా చివరి ఎన్నికలు కానున్నాయి.

జనసేన పొత్తులతో ముందుకెళుతుందా? లేక సొంతంగా ముందడుగులు వేస్తుందా? అనే ప్రశ్నలకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. టీడీపీ, వైసీపీ మధ్య పోటాపోటీగా ఎన్నికలు జరగనుండగా టీడీపీ ఎలాంటి హామీలతో ప్రజల ముందుకు వస్తుందో చూడాల్సి ఉంది.