బిగ్ బాస్ గ్లామర్ డాల్ వాసంతి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 రోజుకి చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా గత కొంతకాలంగా నామినేషన్ ప్రక్రియతో పాటు ఎలిమినేషన్ కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉన్న వారందరూ వరుసగా ఎలిమినేట్ అవుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెంట్ గా ఉన్న ఆర్జె సూర్య ఎనిమిదవ వారంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇక టైటిల్ ఫేవరెట్ గా ఉంటూ ఇంటి సభ్యులకు గట్టి పోటీ ఇచ్చిన గీతు రాయల్ ఎవరు ఊహించని విధంగా 9వ వారంలో ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది.

ఇక ఇటీవల జరిగిన పదవవారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. పదవ వారంలో మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అవ్వగా బాలాదిత్య ఎలిమినేట్ అవ్వనున్నట్లు ముందు నుండి వార్తలు వినిపించాయి. అయితే ఈ పదవ వారంలో డబుల్ ఎలిమినేషన్ అని బిగ్ బాస్ అందరికి ట్విస్ట్ ఇచ్చాడు. పదవ వారంలో జరిగిన డబుల్ ఎలిమినేషన్ లో బాలాదిత్య తోపాటు గ్లామర్ డాల్ వాసంతి కూడా ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో తన వంతు కృషి చేస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న వాసంతి అప్పుడప్పుడు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఈ పదవ వారంలో ఎలిమినేట్ కావలసి వచ్చింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో వాసంతి రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. బిగ్ బాస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం … పది వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన వాసంతి వారానికి 25 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం పది వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన వాసంతి మొత్తం రూ 2.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇలా బిగ్ బాస్ షోలో పాల్గొన్న వాసంతి మరింత పాపులర్ అవటమే కాకుండా.. ఆమెకు అందిన రెమ్యూనరేషన్ తో సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది .