ప్రస్తుత కాలంలో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమలోని టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. అలాగే తన టాలెంట్ ద్వారా యూట్యూబ్ ఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఒకరు. షణ్ముఖ యూట్యూబ్ ఫర్ గా మాత్రమే కాకుండా తన ప్రేయసి దీప్తి సునయన తో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరిస్ చేయటం వల్ల వీరి జంట బాగా పాపులర్ అయ్యారు. దీంతో మొదట దీప్తి బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల దీప్తి తన ఫాలోయర్స్ ని పెంచుకుంది.
షణ్ముఖ్ జస్వంత్ కూడ యుట్యూబర్ గా పాపులర్ అవ్వటంతో బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ సిరి తో హద్దుమీరి ప్రవర్తించడంతో చాలా నెగెటివిటీ మూటకట్టుకున్నడు. దీంతో సిరి కూడ నెగటివ్ కామెంట్స్ ఎదుర్కోవలసి వచ్చింది. టాప్5 లో ఉన్న షణ్ముఖ్ టైటిల్ గెలుస్తానని ఎంతో ధీమాగా ఉన్నాడు. కానీ సిరి, షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో చేసిన పనుల కారణంగా తన ఇమేజ్ పోగొట్టుకోవడం మాత్రమే కాకుండా టైటిల్ కూడ మిస్ చేసుకున్నాడు.
షణ్ముఖ్ బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తరువాత దీప్తి బ్రేక్ అప్ చెప్పింది. అప్పటి నుండి ఇద్దరు వారి పనులతో చాలా బిజీ ఇపోయారు. ఇటీవల సిరి కూడ మంచి అవకాశాన్ని దక్కించుకుంది. సిరి ఆహా లో స్ట్రీమ్ కానున్న “బీఎఫ్‌ఎఫ్” వెబ్ సిరీస్ లో నటించనుంది. ఇక షణ్ముఖ్ కూడ “ఏజెంట్ ఆనంద్ సంతోష్” సీరీస్ చేయబోతున్నాడు. ఇలా వీరిద్దరు ప్రస్తుతం ఆహా ద్వార మనల్ని ఎంటర్టైన్ చేయటానికి రెడీ అవుతున్నారు. అంతే కాకుండ వీరిద్దరితో పాటు
శ్రీహాన్, పృధ్వీ, తేజ్ వంటి వారితో కలసి క్విక్ ఫిక్షన్’ అనే వెబ్ సిరిస్ లో నటించనున్నారు.
