ముగిసిన ఓటింగ్… ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం మరొక రోజుతో ఆరవ వారం పూర్తి చేసుకోబోతోంది.ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం నుంచి ఐదు మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. ఇకపోతే తాజాగా ఆరవ వారం ఓటింగ్ కూడా ముగియడంతో బయటకు వెళ్లే కంటెస్టెంట్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఆరో వారం ఎలిమినేషన్ లో భాగంగా ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్ల ఏవీలు సిద్ధం చేశారని వీరిద్దరిలో ఈవారం తప్పకుండా ఒక్కరు బయటకు వెళ్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అనే విషయానికి వస్తే…

ఆరవ వారం నామినేషన్ లో భాగంగా మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ వారం నామినేషన్ లో భాగంగా ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, శ్రీహాన్, రాజశేఖర్, శ్రీ సత్య, ఆది రెడ్డి, సుదీప పింకీ, గీతూ రాయల్‌లు ఆరో వారానికి నామినేట్ అయ్యారు.ఇలా నామినేట్ అయినటువంటి 9 మంది కంటెస్టెంట్లలో రాజశేఖర్ సుదీప మినహా మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ సేఫ్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ తొమ్మిది మంది కంటెస్టెంట్లలో రాజశేఖర్ ఎనిమిదవ స్థానంలో ఉండగా సుదీప తొమ్మిదవ స్థానంలో ఉండి డేంజర్ జోన్ లో ఉన్నారు. కనుక ఇప్పటికే డేంజర్ జోన్ లో ఉన్నటువంటి ఈ ఇద్దరి కంటెస్టెంట్లు ఏవి లను కూడా నిర్వాహకులు సిద్ధం చేశారని వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లాల్సిందేనని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిలో ఎక్కువ శాతం సుదీప ఈ వారం ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు బయటకు వెళ్తారో తెలియాలంటే మరొక రోజు వేచి చూడాలి. ఇక ఈ వారం ఓటింగ్ పోల్ చూస్తే కనుక రేవంత్ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల శ్రీహన్ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో ఆది రెడ్డి ఉన్నారు. మూడవ స్థానంలో కీర్తి నాలుగవ స్థానంలో గీత ఐదో స్థానంలో బాలాదిత్య ఆరో స్థానంలో శ్రీ సత్య ఏడో స్థానంలో ఇనయా ఉన్నట్లు తెలుస్తోంది.